Actress Satya Krishnan About Casting Couch: స‌త్య‌కృష్ణ‌.. ఈమెను ఇలా కంటే ‘ఆనంద్’ సినిమాలో రూప ఫ్రెండ్ అనిత అంటేనే బాగా గుర్తుప‌డ‌తారేమో. టాలీవుడ్‌లో ఎంతోమంది హీరో, హిరోయిన్ల‌కు వ‌దిన‌గా, అక్క‌గా, ఫ్రెండ్‌గా నటించారు ఆమె. ఎన్నో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేసిన స‌త్య కృష్ణన్ తెలుగు వాళ్ల‌కు అభిమాన న‌టి అయ్యారు. కాగా.. ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ మ‌నం స్ట్రాంగ్ గా ఉంటే అలాంటి ఇబ్బందుల‌కు గురి అయ్యే అవ‌కాశం ఉండ‌దు అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. 


మహిళలు వివక్షకు గుర‌వుతున్నారా?


 ఇండస్ట్రీలో మహిళలకు ఉండే ప్రాధాన్యం, వివక్ష తదితర అంశాలపై సత్య స్పందిస్తూ.. “అది ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి? ఎక్కువ‌గా ఫిలిమ్ ఇండ‌స్ట్రీ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే.. మ‌నం ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతాం కాబ‌ట్టి బ‌య‌టికి వ‌స్తుంది. ప్ర‌పంచంలో చాలాచోట్ల ఉంది. నా వ‌ర‌కు మాత్రం అలాంటివి రాలేదు. నేను ఫేస్ చేయ‌లేదు. మ‌నం మ‌న లైఫ్ ని ఎలా డీల్ చేస్తామనేదే ముఖ్యం’’ అని తెలిపారు. 


కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ.. 


“కాస్టింగ్ కౌచ్ లాంటివి ఎక్కువ‌గా ఉమెన్ ఫేస్ చేయ‌డానికి కార‌ణం.. ప్ర‌పంచంలో ఉన్న అంద‌మైన మ‌హిళ‌లు. అందంగా క‌నిపించేవాళ్ల‌ను ఎవ‌రైనా అట్రాక్ట్ చేస్తారు. మ‌న‌ల్ని మ‌నం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అనేదే ముఖ్యం. మ‌హిళ‌ల‌కి క‌చ్చితంగా ధైర్యం ఉండాలి. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని ధైర్యంగా చెప్పేలా ఉండాలి. ఒప్పుకోక‌పోతే ఛాన్స్ రాదేమో అనే ఫీలింగ్ నుంచి బ‌య‌టికి రావాలి. ఇది కాక‌పోతే వేరే లైఫ్ లేదు అనే ఉద్దేశంతో వ‌స్తారు కొంత‌మంది. అలాంటి వాళ్లు క‌మిట్ అయిపోతారు. ఫోర్స్‌కు లొంగిపోతారు. వేరే అవ‌కాశం లేదు అనుకునేవాళ్లు అలా చేస్తారు. నేను ఏదైనా చేసుకోగ‌ల‌ను అనే ధైర్యం ఉంటే ఒత్తిడికి లొంగం. ఆ ప్రాబ్ల‌మ్ ఫేస్ చేసిన వాళ్ల‌కి తెలుస్తుంది దాని గురించి. ఇంకోటి నేను ఇలాంటివి ఫేస్ చేయ‌లేదు. కానీ, కొన్ని సిచ్యుయేష‌న్స్ వాళ్ల‌ను డిమాండ్ చేసి ఉండొచ్చు. కానీ, ధైర్యంగా ఉండాలి, నో చెప్పాలి, నాతో ఇలాంటివి వ‌ర్కౌట్ అవ్వ‌వు అని చెప్పేలా ఉండాలి” అని తెలిపారు.


“మీ టూ అయిన‌ప్పుడు నా ద‌గ్గ‌రికి వ‌చ్చి మీ లేడీస్‌తో మాట్లాడితే భ‌యం వేస్తోంది. మీతో మాట్లాడితే ఇలా చేశారు?. అలా చేశారు అని అంటారు” అన్నారు . ‘‘నేను ఎప్పుడూ అలాంటివి ఫేస్ చేయ‌లేదు. నాకు ఎందుకు చెప్తున్నారు? క‌వ‌రప్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. త‌ప్పు చేస్తేనే క‌వ‌ర్ చేసుకుంటారు. సినిమా ఇండ‌స్ట్రీ గ్లామ‌ర్ అలాంటిది. ఎలాగైనా వెళ్లాలి అనే ఉద్దేశంతో ఉంటారు చాలామంది. అలాంట‌ప్పుడు ఇలాంటివి జరుగుతాయి. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో అలా ఉంటాయి అని చెప్పేవాళ్లే.. ఎలాగైనా ఇండ‌స్ట్రీలోకి వెళ్లాల‌నే ఉద్దేశంతో కూడా ఉంటారు. అవ‌కాశాలు కోసం మాత్ర‌మే కొంత‌మంది అలా చేస్తుంటారు. ఒక్కోసారి కొంత‌మంది ఇష్టంగా ఒప్పుకుని, ఆ త‌ర్వాత దాన్ని క్యాష్ చేసుకోవాల‌ని కూడా చూస్తారు ” అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు స‌త్య కృష్ణన్. 


Also Read: ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు బెయిల్ - నిజంగానే అతడి ఇంట్లో గంజాయి ఉందా? ఏసీపీ ఏం చెప్పారు?