Food Safty Worst In AP :  ఆహార శుభ్రతలో ( Food Safty ) ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కల్లా చివరన ఉందని కేంద్రం ప్రకటించింది. ఐదు  పారామీటర్స్‌లో తమిళనాడు ( Tamil nadu ) 82 పాయింట్లు తెచ్చుకుని అగ్రస్థానంలో ఉండగా.. బీహార్ కంటే కూడా తక్కువగా కేవలం 26  పాయింట్లు మాత్రమే తెచ్చుకుని ఏపీ అట్టడుగుననిలిచింది. ఫుడ్ సేఫ్టీ పై ...ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ( FSSAI) అన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఈ ర్యాంకులను ప్రకటించింది. 


వివాహ వేడుకలో దుమ్మురేపిన దీదీ- ఫోక్ డ్యాన్స్‌కు సోషల్ మీడియా షేక్!


ఐదు అంశాల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్


మొత్తంగా ఎఫ్ఎస్‌ఏఏఐ ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. పుడే సేఫ్టీకి సంబంధించి  మానవ వనరులు, సంస్థాగత డేటా, ఫిర్యాదులు, ఆహార పరీక్ష మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపుదల, వినియోగదారుల సాధికారత వంటి అంశాలను పరిశీలించి  పాయింట్లు కేటాయించారు. ఈ పాయింట్లలో తమిళనాడు ( Tamilnadu )  అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం గుజరాత్‌కు దక్కింది. గుజరాత్‌కు 7౦ పాయింట్లు లభించాయి. తర్వాత మహారాష్ట్ర నిలచింది. చిట్ట చివరిగా ఏపీ నిలిచింది.   


భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ


చిన్నరాష్ట్రాల్లో గోవా అగ్రస్థానం 


చిన్న రాష్ట్రాల కేటగిరిలో గోవా ( Goa ) అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో మణిపూర్, సిక్కిం ఉన్నాయి. ఆఖరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. గత ఏడాది గుజరాత్ ( Gujarat ) అగ్ర స్థానంలో ఉంది. కేరళ , తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది తమిళనాడు అగ్రస్థానానికి చేరుకుంది. ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఆహారాన్ని శుభ్రంగా అందిస్తున్నారో లేదో అంచనా వేయడంలో ఈ ర్యాంకులను కీలకంగా పరిగణిస్తున్నారు. 


పబ్‌జీకి బానిసైన బాలుడు- ఆడొద్దన్నందుకు తల్లినే కాల్చి చంపేశాడు!


ఏపీలో  దారుణంగా ఫుడ్ సేఫ్టీ పరిస్థితి 


జూన్ 7ను ప్ర‌తి ఏటా వ‌ర‌ల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా జ‌రుపుకుంటారు. ఆహార భ‌ద్ర‌త ప్రాముఖ్య‌త‌, వ్య‌క్తిగ‌త ఆరోగ్యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ఈ రోజు ల‌క్ష్యం. ఈ ఏడాది ‘సుర‌క్షిత‌మైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం’ అనే థీమ్‌ మంగళవారం నిర్వహించారు. బుధవారం ర్యాంకులు ప్రకటించారు.