Sajjala Ramakrishna Reddy : ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 100కి వంద శాతం అమలయ్యేలా హామీలు  ఉండాలన్నారు. మేనిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల ఆచరణ సాధ్యంపై పరిశీలించాలన్నారు. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను 98 శాతం పైగా పూర్తి చేసిందని తెలిపారు. అంతకు ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని విమర్శలు చేశారు. 2014లో ఇలాంటి అడ్డగోలు హామీలు ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు. 


కొత్త పార్టీలను స్వాగతిస్తాం


"ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి మా పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు. మా విధానం మాకుంది. మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని సొంతం చేసుకున్నారు. కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషకుల స్థానంలో లేం. మా రాష్ట్రం అభ్యున్నతి మాకు ముఖ్యం. చిరంజీవి తన తమ్ముడి గురించి ఒక అన్నగా ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడారు. ఈ రాష్ట్రం మా వేదిక, ఇక్కడి ప్రజల బ్లేస్సింగ్స్ అడుగుతున్నాం. పక్క రాష్ట్రాల గురించి మేం మాట్లాడటం లేదు. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి విమర్శలు ఎందుకు? భవిష్యత్తు రాజకీయాల గురించి వాళ్లు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు. మేము ఇక్కడి వ్యవహారాలపై మాత్రమే కట్టుబడి ఉన్నాం."- సజ్జల రామకృష్ణా రెడ్డి 


వైసీపీ సిద్ధాంతం అదే 


ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పడుతుందన్నారు. ప్రజల అభ్యున్నతికి విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదే అన్నారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తుందన్నారు. అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారని సజ్జల తెలిపారు. తమ అంతిమ నిర్ణేతలు ప్రజలే అన్నారు. తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడటంతోనే అలా స్పందించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నామన్నారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. అందరూ బాగుండాలనేదే వైసీపీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమం పేరుతో దుష్ప్రచరం చేస్తున్నారని విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  


తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రస్తుత టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్రీయ సమితిగా మార్పుచేశారు. ఈ పార్టీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాన్ని అమలుచేస్తోందో అని నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీని ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి


Also Read : ప్రధాని కావాలన్న ఆశతో ప్రజల్ని కేసీఆర్ వంచిస్తున్నారు: విష్ణు వర్దన్ రెడ్డి


Also Read : Tadipatri News :తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు, ఉద్రిక్తతల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ