Supreme Court :    సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మూడు ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ విధించిన  రూ. వంద కోట్ల జరిమానా ,  ప్రాజెక్టుల నిర్మాణంపై స్టేను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.  ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రాజెక్టుల నిర్మాణంపై ఇచ్చిన స్టేను తొలగించేందుకు నిరాకరించింది. అయితే రూ. వంద కోట్ల జరిమానా విధించవచ్చా లేదా అన్న దానిపై పరిశీలన చేయనున్నారు. కానీ తక్షణం రూ. పాతిక కోట్లను జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. 


మూడు రిజర్వాయర్ల నిర్మాణాలను ఆపేయాలన్న  ఎన్జీటీ
 
 చిత్తూరు జిల్లాలో  ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై  గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌పై   ఎన్జీటి చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. ఆవులపల్లి , ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులను సైతం ఎన్జీటీ రద్దు చేసింది. మూడు రిజర్వాయర్లను ఒకే జీవో కింద చేపట్టి తాగునీటి కోసమని ఏపీ ప్రభుత్వం మొదట వాదించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తరువాత  మూడు ప్రాజెక్టులను విడగొట్టి ఆవులపల్లి రిజర్వాయర్‌కి మాత్రమే ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. 


మాజీ మంత్రి అనిల్‌ టీడీపీలోకి వెళ్తున్నారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన రియాక్షన్ ఏంటీ?


పర్యవరణ అనుమతి ఫైల్స్ ను మార్చారని ఎన్జీటీ ఆగ్రహం 


పర్యావరణ అనుమతుల ఫైళ్లను కూడా ప్యాబ్రికేట్ చేశారని ఎన్జీటి ధర్మాసనం మండి పడింది.  కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఎన్జీటి కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్జీటి ఆదేశించింది. పిటిషనర్ గుత్తా గుణశేఖర్ తరపున ఎన్జీటిలో లాయర్ కె. శ్రవణ్ కుమార్ వాదించారు. పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కంపెనీ ఫీజు చెల్లించింది. మూడు ప్రాజెక్టులకు కలిపి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులను తీసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్న శాఖ అనుమతులు మాత్రమే ఏపీ ప్రభుత్వం తీసుకుంది. దీనిపై ఎన్జీటీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.


గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఈసీ- జనసేన నుంచి జారిపోయినట్టేనా!`


ఆ ప్రాజెక్టుల పనులు చేస్తుంది కూడా పెద్దిరెడ్డి కంపెనీలే !


నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెందిన కంపెనీలే టెండర్లు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్జీటీ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా పనులు జరిగాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్జీటీ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.