ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే నెల 28కి వాయిదా వేసింది. రాజధానిపై పిటిషన్లను తొందరగా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. త్వరగా వాదనలు ముగించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఆ పిటిషన్లపై మార్చి 28న విచారణ చేపడతామని చెప్పింది. ఈ పిటిషన్లపై గత వారం విచారణ జరగాల్సింది. అయినా కూడా రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసింది. అందుకే అప్పుడు వాయిదా పడింది.
AP Capital News: ఏపీ రాజధాని పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మళ్లీ వాయిదా
ABP Desam
Updated at:
27 Feb 2023 12:22 PM (IST)
ఈ పిటిషన్లపై గత వారం విచారణ జరగాల్సింది. అయినా కూడా రాజ్యాంగ ధర్మాసనం బుధ, గురువారాల్లో మిస్‌లేనియస్ పిటిషన్లపై విచారణను నిలుపుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం