కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్‌ల వారీగా నిర్దేశించిన కొన్ని రైళ్లలో జనరల్ ప్రయాణికులకు ఇకపై రిజర్వేషన్ అవసరంలేదని ప్రకటించింది. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణ అవకాశం కల్పిస్తూ దక్షణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్‌లను రైల్వే స్టేషన్ లలో పొందవచ్చని పేర్కొంది. రైల్వే బుకింగ్ కౌంటర్‌ల వద్ద కానీ, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఈ టికెట్లు పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
74 రైళ్లలో రిజర్వేషన్ విధానం రద్దు
రైళ్లలోని జనరల్ బోగీల్లో కొవిడ్‌కు ముందు ప్రయాణించిన విధంగా ప్రయాణం చేయవచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదని తెలిపింది. స్టేషన్లలోని జనరల్ బుకింగ్ కౌంటర్లలో అన్ రిజర్వుడ్ టికెట్లు తీసుకుని ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. ఈ నెల 24 నుంచి దశలవారీగా ఈ విధానం అమల్లోకి వస్తుందని వెల్లండించింది. హైదరాబాద్ - పూర్ణ రైలులో మాత్రం 22 నుంచి అమలుచేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. జోన్ పరిధిలోని 74 రైళ్లలో జనరల్ బోగీలను రిజర్వేషన్ విధానం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో సికింద్రాబాద్ డివిజన్‌లో 29, విజయవాడ డివిజన్‌లో 12, గుంటూరులో 5, గుంతకల్లులో 10, హైదరాబాద్‌లో 6, నాందేడ్‌లో 12 రైళ్లున్నాయని తెలిపింది.
Also Read: AP Politics: బీసీల సంక్షేమం కోసమే పథకాలు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గెలుస్తాం..
విజయవాడ డివిజన్ పరిధిలో ఈ నెల 24 నుంచి
- గూడూరు–సికింద్రాబాద్ (02709)
- గూడురు–విజయవాడ (02743/02744)
- విజయవాడ–సికింద్రాబాద్ (02799)
- నర్సాపూర్–ధర్మవరం (07247)
- కాకినాడ టౌన్–రేణిగుంట (07249)
- నర్సాపూర్–లింగంపల్లి (07255)
ఈ నెల 25 నుంచి
- మచిలీపట్నం–బీదర్ (02749)
- విజయవాడ–లింగంపల్లి (02795)
ఈ నెల 27 నుంచి
- కాకినాడ పోర్టు–లింగంపల్లి (02737)
- నర్సాపూర్–నాగర్‌సోల్ (07231 )
ఈ నెల 28 నుంచి
- నర్సాపూర్–నాగర్‌సోల్ (02713)
ఈ రైళ్లలో రిజర్వేషన్ లేకుండానే ప్రయాణానికి అవకాశం కల్పించారు.