ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానని ఆశచూపి ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా కొండపల్లిలోని శాంతినగర్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో నివాసముండే ఆరేళ్ల బాలుడు ఆదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. బాలుడికి చాక్లెట్ కొనుక్కొనేందుకు డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. నమ్మిన బాలుడు ఆ వ్యక్తితో కలిసి వెళ్లాడు. పక్కనే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.


దీంతో బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో వారు.. ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాలుడికి గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
Also Read: Gold Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి పయనం.. బులియన్ మార్కెట్లో లేటెస్ట్ రేట్లు ఇవే..


మాజీ మంత్రి దేవినేని పరామర్శ
అఘాయిత్యానికి గురైన బాలుడిని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. బాలుడిపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు
చాక్లెట్లు కొనుక్కోవడానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఖమ్మం మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పి.చంద్రశేఖరప్రసాద్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పింగళి గణేశ్‌ (20) అలియాస్‌ చింటూ అనే వ్యక్తి నాలుగేళ్ల పసిపాపపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2020 నవంబర్ 19న చాక్లెట్లు కొనుకున్నేందుకు వచ్చిన బాలికపై (4) అత్యాచారం చేశాడు.


ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చింటూపై మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి 20 ఏళ్ల జైళ్ల శిక్షను ఖరారు చేస్తూ.. తీర్పు వెలువరించారు.


Also Read: Weather Updates: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక


Also Read: YSR Housing Scheme: అక్టోబర్ నుంచి జగనన్న కాలనీలు.. పేదలందరికీ ఇళ్ల పథకంపై సీఎం జగన్ రివ్యూ... టిడ్కో ఇళ్లపైనా కీలక నిర్ణయం