మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ సంచలన కామెంట్స్ చేశారు. కొందరు నేర విచారణ అధికారులు, కల్పిత కథా రచయితలుగా మారిపోయారని అన్నారు. వారు చేస్తున్న కృషికి ఏదైనా అవార్డు ఇస్తున్నారా? అంటూ ట్వీట్ చేశారు. ఆయన కామెంట్స్ కొందరు స్పందించారు. మతిస్థిమితం లేని పాలకుడు, మతిస్థిమితం లేని మాటలు, స్కిల్‌ కేసుపై రోజుకో లెక్క శీర్షికతో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో గతంలో చేసిన ట్వీట్లకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. అందులో చంద్రబాబే సూత్రధారి అని, అవినీతి మొత్తం రూ.3,300 కోట్లుగా ఒకసారి, తర్వాత రూ.550 కోట్లుగా మరోసారి, రూ.371 కోట్లుగా ఇంకోసారి, చివరిగా రూ.27 కోట్లకు తగ్గించిన ఫోటోలు ఉన్నాయి.