తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఆశించిన స్థాయిలో మేలు జరగలేదన్నారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన క్రైస్తవ హక్కుల సమావేశం జరిగింది. సోనియా గాంధీ చొరవతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా,  అధికారంలోకి మరో పార్టీ రావడంతో  ప్రజలకు మంచి జరగలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవన్నారు. హైదరాబాద్‌లో జరిగిన cwc సమావేశం తరువాత నిర్వహించిన ర్యాలీలో యువత భారీగా పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిందేనని చిదంబరం అభిప్రాయపడ్డారు.


నలుగురిలో ఒకరికీ ఉద్యోగం లేదు
తెలంగాణలో  ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లేదన్నారు చిదంబరం. డిగ్రీలు చదివిన 42శాతం మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని గుర్తు చేశారు. గడిచిన 20 నెలల్లో 6 శాతం ధరలు పెరిగాయన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కేసీఆర్‌ను  మోడీ తిడుతున్నారని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా 3.30 కోట్లు మంది క్రైస్తవులు ఉంటే, ఒక్క మంత్రి పదవిని మాత్రమే బీజేపీ ఇచ్చిందన్నారు.