ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసేందుకు  శ్రీ సిమెంట్‌ కంపెనీ అధినేతలు ఆసక్తి చూపించారు. 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం  చేశారు. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్‌ ఉన్నాయి. ఏపీలో ఒక్కటి కూడా లేదు. ముఖ్యమంత్రి జగన్ పారిశ్రామిక విధానం నచ్చి ఏపీలో కూడా ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.  ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  జగన్‌ను కలిసి పెట్టుబడుల ప్రతిపాదనను  శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌ వివరించారు.


 


Also Read: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్


రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ..  ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏ రకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగులకోసం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని శ్రీ సిమెంట్స్ ఎండీ బంగూర్ ప్రశంసించారు.  రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారని దీని వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఆదాయాలు రావాలన్నది సీఎం ఉద్దేశమని ఆయన వివరించారు.  దేశంకంటే రాష్ట్ర వృద్దిరేటు అధికంగా ఉందని   భవిష్యత్తులో కూడా ఇది మరింతగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని బంగూరు స్పష్టం చేశారు.  .  ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని... అందువల్లే మేం ఇక్కడ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 


Also Read:  మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కోసం ఏపీ సీఐడీ పోలీసుల సెర్చింగ్ ! అరెస్ట్ కోసమేనా ?


ప్రస్తుతం  శ్రీ సిమెంటు ప్లాంటులో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నామని బంగూర్ సోదరులు తెలిపారు.   పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటు వల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని తద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని జేఎండీ ప్రశాంత్ బంగూర్ తెలిపారు.  పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.  


Also Read: టీడీపీలో చేరేందుకు సూరి తాపత్రయం.. అడ్డం పడుతున్న శ్రీరామ్ ! ఎవరిది పైచేయి ?


సిమెంట్ పరిశ్రమకు సంబంధించి భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు. ఎంవోయీలు వంటివి త్వరలో చేసుకునే అవకాశం ఉంది. పల్నాడులో ఇప్పటికే పలు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. అయితే అవన్నీ కాలుష్య కారకమైనవి. ఇప్పుడు శ్రీ సిమెంట్స్ ఏర్పాటు చేయబోయేది గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ కావడంతో కాలుష్యం ఉండదని భావిస్తున్నారు.


Also Read: అవినీతికి ఆధారాలున్నాయా..? స్కిల్ స్కాంలో సీఐడీకి హైకోర్టు ప్రశ్న... ఘంటా సుబ్బారావుకు షరతుల బెయిల్ !


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి