చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ రెండు గ్రూపులు.. ఆరుగురు నేతలన్నట్లుగా మారిపోయింది. ఓ వైపు ఎమ్మెల్యే రోజా ఉండగా.. మరో వైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు ఎవరికి వారు రాజకీయం చేసుకుంటున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలో రెండు గ్రూపులు వేర్వేరుగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకల్లో రోజా ఓ భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తన క్యాడర్ మొత్తాన్ని మోహరించి... ర్యాలీ నిర్వహించి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను బలప్రదర్శన రూపంలోచెప్పారు.
అయితే ప్రత్యర్థి వర్గం కూడా పుట్టినరోజు వేడుకలు విడిగా నిర్వహించింది. ఎమ్మెల్యే రోజా తరహాలో భారీ ర్యాలీ నిర్వహించకపోయినా.. నియోజకవర్గం మొత్తం తమ ముద్ర కనిపించేలా.., రోజా లోటు కనిపించేలా వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ నగరి నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. కానీ 90 శాతం ఫ్లెక్సీల్లో రోజా ఫోటో లేదు.
రోజా వ్యతిరేక వర్గం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. రోజా అనుకూల వర్గీయులు అక్కడక్కడా ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీల్లో మాత్రం రోజా ఫోటోలు ఉన్నాయి. దీంతో నగరి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేనట్లుగా ఇతర పార్టీల నేతలు ఉండటం.. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ కన్నా సొంత అనుచరులతోనే రోజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం... ఆ పార్టీ సానుభూతిపరుల్లోనూ విస్మయం కలిగిస్తోంది.
Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం
జాతో వైఎస్ఆర్‌సీపీ మండల స్థాయి నేతల విభేదాలు పెరుగుతున్నా హైకమాండ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పకపోతే.. ముందు ముందుపార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని క్యాడర్ ఆవేదన చెందుతున్నారు. అయితే రోజా..లేదంటే తాము అన్నట్లుగా అసమ్మతి వర్గం రాజకీయాలు చేస్తూండటంతో ఈ సమస్య హైకమాండ్ కూడా పరిష్కరించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి