AP municipal workers strike called off  :  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులుగా చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమ్మెను తాత్కలికంగా విరమించారు. నిలిపివేసిన హెల్త్ అలవెన్స్ నెలకు రూ. 6 వేలను తిరిగి ఇవ్వడానికి  ప్రభుత్వం అంగీకరించింది.  ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి హెల్త్ అలవెన్స్ ఇతర సమస్యలపై రాతపూర్వక  ఆదేశాలు జారీ చేయాలని..  లేక‌పోతే  మరోసారి ఆందోళనకు సిద్ధపడతాం అని కార్మిక సంఘాలు హెచ్చ‌రించాయి. 


ఉచితంగా ప్రికాషన్ డోస్ - అన్ని రాష్ట్రాల సీఎస్‌కు కేంద్రం ప్రత్యేక సూచనలు !


`విజయవాడలో కార్మికులతో అధికారుల చర్చలు


విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన కార్మికులతో అధికారులు చర్చించారు. విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు నాలుగు సార్లు మస్టర్లు వేసే విధానాన్ని రద్దు చేసి రెండు పూటలు మాత్రమే వేయటానికి అధికారులు అంగీకరించారు. వారానికి ఒక  పూర్తి రోజు సెలవు ఇవ్వటానికి, పనిలో నుండి నిలిపివేసిన వారిని, చనిపోయిన
 వారి కుటుంబ సభ్యులను కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకోవడానికి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అన్ని విభాగాల కార్మికులకు తగు న్యాయం చేయడానికి అధికారులు అంగీకరించినట్లు కార్మిక నాయకులు ప్రకటించారు. 


సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏపీ రోడ్ల ఫోటోలే - నెంబర్ వన్‌గా ట్రెండ్ చేసిన జనసైనికులు !


ప్రభుత్వం తమతో చర్చించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ 


ఐదు రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మె విజయవంతం అయ్యిందని కార్మిక నేతలు తెలిపారు.  ప్రభుత్వం దిగివచ్చి హెల్త్ అలవెన్స్ పునరుద్ధరించడానికి అంగీకరించిందన్నారు.  కార్మిక సంఘాలతో అన్ని సమస్యలు సమగ్రంగా చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేయటం మంచిది కాదన్నారు. తక్షణమే జేఏసీ, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి ఆదేశాలు ఇవ్వాలన్నారు. 


పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ పశ్చిమ ఆస్ట్రేలియా ఒప్పందాలు, జులై 16న కీలక సమావేశం- మంత్రి గుడివాడ అమర్ నాథ్


జగన్  హామీ ఇచ్చినట్లుగా రెగ్యులరైజ్ చేయాలన్న కార్మిక నేతలు 


హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్, పార్కులు తదితర అన్ని విభాగాల కార్మికులకు 21 వేల రూపాయల వేతనం ఇవ్వాలి , కార్మిక సంఘాలు పేర్కొన్న ఇతర 21 సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.లేకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా భవిష్యత్తులో కార్మికులను రెగ్యులరైజ్ చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.