ప్రయాణం అంటే చాలామందికి సరదాగా ఉంటుంది. మరి కొంతమందికి భయంగా ఉంటుంది. బస్ పడదు, రైల్ ఎక్కితే పడదు వాంతులు అవుతాయి, కళ్ళు తిరుగుతాయి లాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఇంక కొంతమందికి అయితే విమానం ఎక్కాలంటే వణికిపోతారు. విమాన ప్రయాణంలో మోషన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక విమనలో అయితే బయట గాలి రాదు కాబట్టి వాంతులు, వికారం, చెమటలు పట్టి విసుగ్గా ఉంటుంది. ఆ ఫీలింగ్స్ తో అన్నీ గంటలు అలాగే కూర్చుని ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాని నుంచి బయట పడేందుకు మీరు చిన్న చిన్న టిప్స్ పాటించారంటే ఎటువంటి అసౌకర్యంగా లేకుండా హ్యాపీగా ట్రావెల్ ని ఎంజాయ్ చెయ్యొచ్చు. 


కారు, బస్, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు.. 



  • సీట్లో కూర్చున్నప్పుడు రిలాక్స్ గా కళ్ళు మూసుకుని పడుకోండి. 

  • రాత్రి వేళ ప్రయాణం మరీ మంచిది. దాని వల్ల మీకు ట్రావెల్ సిక్ నెస్ లేకుండా ఉంటుంది. 

  • అతిగా తినడం, మద్యపానం సేవించడం, కాఫీ తాగడం వంటివి చెయ్యకూడదు. శరీరం డీ హైడ్రేట్ అవకుండా తరచూ నీళ్ళు తాగడం ఉత్తమం. 

  • ప్రయాణానికి ముందు GRAVOL ట్యాబ్లెట్స్ వేసుకోవడం మంచిది. దీని వల్ల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. 

  • కారు లేదా బస్ అయితే ముందు సీట్ లో కూర్చునేందుకు ప్రయత్నించండి. కిటికీ లోనుంచి బయటకి చూస్తూ వాతావరణాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. 

  • కిటికీ అద్దాలు తెరిచి పెట్టుకోవాలి. మ్యూజిక్ వింటూ మీ మైండ్ రిలాక్స్ గా ఉంచుకోవాలి. 


విమానంలో ప్రయాణిస్తున్నపుడు..  



  •  విమానం రెక్కల దగ్గర ఉన్న సీట్స్ ఎంచుకోవడం బెటర్. 

  •  వాంతులు, వికారం, మోషన్ సిక్ నెస్ లేకుండా ఉండేందుకు మెడిసిన్ తీసుకోవాలి. దాని వల్ల మీకు మగతగా ఉండి నిద్ర వస్తుంది. మీ శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. 

  • విమాన ప్రయాణం అనగానే ఆందోళన, ఒత్తిడిగా ఉండటం సహజం. అందుకే మన మనసు, ఆలోచనలు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చెయ్యాలి. 

  • స్పైసీ ఫుడ్ తినకపోవడమే బెటర్. ఇవి తినడం వల్ల కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఫ్రై చేసిన ఆహారం తింటే కడుపులో వికారంగా, వాంతి అయ్యేలాగా అనిపిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండండి. 

  • అన్నిటికంటే మంచి పని ఏదైనా పుస్తకం తీసుకుని చదువుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. 

  • ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీ ప్రయాణం హాయిగా సంతోషంగా సాగిపోతుంది. 


Also Read: చింతపండు వంటలకు రుచి ఇవ్వడమే కాదు బోలెడు అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు


Also Read: థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేదా? ఇవి పాటించి చూడండి