Good Morning CM Sir : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ఉద్దృతంగా ాగింది. గుడ్మార్నింగ్ సీఎం సార్ పేరుతో ఉదయం నుంచి ట్వీట్లు చేయాలని జనసేనానికి పిలుపునిచ్చారు. తాను కూడా చేస్తానన్నారు. ఆ ప్రకారం తాను ప్రయాణించిన ఓ రోడ్డు దుస్థితిని పోస్ట్ చేశారు.
ఆ ప్రకారం #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఆ హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మధ్యాహ్నానికే రెండు లక్షల 70వేలకు పైగా ట్వీట్లతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది.
ప్రతి ఒక్క ట్వీట్‌లో రోడ్ల దుస్థితిని జనసైనికులుచూపించారు. అత్యంత దారుణంగా మారిన రహదారులు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పెట్టారు.
మరో రెండు రోజుల పాటు ఈ డిజిటల్ క్యాంపెన్ నిర్వహించాలని జనసేనాని నిర్ణయించారు. మరో రెండు రోజులూ ఈ అంశం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.