Roja :   చంద్రబాబుపై కక్ష సాధింపు కాదని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అడ్డంగా‌ దొరికి పోయాడని ఏపి మంత్రి ఆర్.కే.రోజా తెలిపారు.. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి ఆర్కే రోజా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.   గత రెండు రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయని, తప్పు చేసే చంద్రబాబుకి శిక్ష పడాలని రాష్ట్ర ప్రజలందరూ భగవంతుడిని ప్రార్థించారని, అందుకే చంద్రబాబు నాయుడు కటకటాల పాలయ్యారని ఆమె విమర్శించారు.. స్నేహ బేరక్ లో చంద్రబాబుకి ప్రత్యేక గదిని, అదేవిధంగా ఖైదీ నెంబర్ 7691 అనే నెంబర్ ని కేటాయించడం జరిగిందన్నారు. అంతే కాకుండా సీసీ కెమెరాల నిఘాలో చంద్రబాబుకి కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం జరిగిందన్నారు..


చంద్రబాబు జైలుకు వెళ్లడంతో బయట నారా లోకేష్, అచ్చం నాయుడు ఓవరాక్షన్ చేస్తున్నారని, చంద్రబాబు ఎంత మందిని జైలుకు పంపాడో, ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో, ఎంతమంది ప్రాణాలు తీశాడో వారి ఉసురు చంద్రబాబుకి తగిలిందన్నారు.. చంద్రబాబుది అక్రమ కేసు కాదని అడ్డంగా దొరికిపోయిన కేసు అని, స్కిల్ డెవలప్మెంట్ అనేది యువత ఉపాధి కోసం రూపొందించబడిందని, యువతను ఆదుకోవాల్సిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామును ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు.. 2014లో బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగ యువతను మోసం చేశాడని, ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి 2000 రూపాయల చొప్పున ఇస్తానన్న చంద్రబాబు నిరుద్యోగులను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు.. నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కు మాత్రం అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడని, 2024లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు.


జగన్ సీఎం అయ్యాక రెండు లక్షల శాశ్వత ఉద్యోగాలు, రెండు లక్షల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, అదే విధంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించడం జరిగిందని, ఇక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు భారీ పరిశ్రమల ద్వారా 85,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు.. ఎంఎస్ఎంఈల ద్వారా 12 లక్షల మందికి యువతకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, కానీ చంద్రబాబు తన కొడుకు బాగుంటే చాలని ఆయన లోకేష్ కు మంత్రిగా ఉద్యోగం ఇచ్చారని, చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయమంటే రాష్ట్రం విడిపోయింది, నష్టంలో ఉందని కాక కబుర్లు చెప్పాడని, నేడు కోట్ల రూపాయలతో హైదరాబాదులో ప్యాలెస్ ఎలా కట్టుకున్నాడో ప్రజలందరికి తెలుసునని, ఇంకా అనేక స్కామ్ లో చంద్రబాబు హస్తం ఉందని, ఇవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని వీటిలో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదన్నారు.


నారాయణ గానీ, లోకేష్ గానీ, అచ్చం నాయుడుకు గానీ త్వరలోనే అరెస్టు కాబోతున్నారని, వీరంత సిద్ధంగా ఉండాలన్నారు.. నన్ను ఎవరు ఏమి చేయలేరని అనుకున్న చంద్రబాబు పరిస్థితి నేడు ఏంటో చూశామని, స్టేలు తెప్పించుకుని ఇంతకాలం కాలం గడిపిన చంద్రబాబు పాపం పండి జీవితాంతం చంద్రబాబు జైల్ శిక్ష అనుభవించాల్సిందేన్నారు.. నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్న చంద్రబాబుని ప్రజలు కూడా ఎటు పోయిన పర్లేదని వదిలేసారని, దీనికి నిన్న జరిగిన రాష్ట్ర బందే ఉదాహరణ అని,అందుకే ప్రజలు తమ కార్యకలాపాలు చూసుకున్నారని, ఫైబర్ గ్రిడ్‌, పోలవరం, పట్టుసీమ, అమరావతి భూముల స్కాం లో సాక్షాలు వస్తాయని, తొందరలోనే చంద్రబాబు మరికొన్ని కేసుల్లో చిక్కుకోక తప్పదని, ఇది కక్ష సాధింపు కాదని అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసు అనేది ప్రజలంతా గుర్తించాలని మంత్రి ఆర్కే రోజా అన్నారు..