Nagari MLA Roja : నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా తాను జగనన్నకు ప్రాణం ఇస్తానని మంత్రి రోజా అన్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్యే సీటు ( Nagari MLA ) లేదు అనే ప్రచారం కేవలం శునకానందం మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రతి రోజు నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లె నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
అన్ని కార్యక్రమాల్లోనూ ముందున్నా!
క్యాబినెట్ సమావేశంమైనా, పార్టీ కార్యక్రమాలైనా ఎప్పుడూ నేను ముందు ఉంటానని తెలిపారు. టీడీపీ ( TDP ) అనుకూల మీడియా దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. టిక్కెట్ రాదని చెప్పి టీడీపీకి వైసీపీ అభ్యర్థులను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. జగనన్నపై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో, అంతకు మూడింతలు పార్టీలో మా అందరికీ ప్రేమ ఉందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పని చేస్తామన్నారు.. సర్వేల ద్వారా చర్చ జరిపి నిర్ణయం కూడా తీసుకున్నారని, ప్రజల వద్ద జగనన్నకు వ్యతిరేకత లేదని రోజా స్ప,్టం చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో హై టెన్షన్- సీటు ఎవరికి? వేటు ఎవరిపై?
ప్రజలకు అందుబాటులో లేని వారికే టిక్కెట్లు మార్పు
ప్రజలకు అందుబాటులో లేక సీట్లు లేక పోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని రోజా అన్నారు. నగిరిలో సీటు రోజాకు లేకుంటే ఎవరు నిల్చుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒక్కచోట నిలబడటానికి భయపడుతున్నారని, అందుబాటులో ఉన్నాం కాబట్టే రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రులు అయ్యామని, 175 సీట్లకి 175 పక్కాగా వైసిపి గెలుపు సాధిస్తుందని అన్నారు. నగరిలో ఎవరికి ఇచ్చినా తాను జగన్ అన్నకు ప్రాణం ఇస్తానని స్పష్టం చేశారు.
శ్రీకాకుళంలో కొత్త ప్రయోగం చేయనున్న వైఎస్‌ఆర్‌సీపీ- ప్రస్తుతానికి ఎచ్చెర్ల లీడర్లకు విజయవాడ పిలుపు
రోజాకు టిక్కెట్ నిరాకరిస్తున్నారని విస్తృత ప్రచారం
నగరి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రోజాకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కారణంగా సీఎం జగన్ టిక్కెట్ నిరాకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలతో రోజాకు సఖ్యత లేదు. ఐదు మండలాల నాయకులు రోజాను వ్యతిరేకిస్తున్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజాకు వ్యతిరేకమేనని చెబుతున్నారు. ఈ క్రమంలో రోజా తనకు జగన్ టిక్కెట్ ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు.