రాష్ట్రంలో రహదారులపై ఉన్న గుంతలు తక్షణమే పూడ్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వెంటనే పనులు ప్రారంభించంచాలని.. 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలన్నారు. పాట్ హోల్ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలని.. తర్వాత కార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి రావాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు.
Also Read : కొడుకు పెళ్లి కోసం ఊరికి రోడ్డు... ఓ తండ్రి ఆలోచనపై గ్రామస్తుల హర్షం
స్పెసిఫిక్ రోడ్లు కాకుండా రాష్ట్రం మొత్తం రిపేర్లు చేయాలని చేయండి, ఎక్కడా గుంత కనిపించకూడదని.. మేం అన్ని చేశామనే మెసేజ్ వెళ్ళాలన్నారు. మేజర్ రోడ్లకు ట్రాఫిక్‌ను బట్టి ఏ మేరకు మరమ్మత్తులు చేయాలనే దానిపై సమావేశంలో అధికారులు వివరించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలు, పనుల పురోగతిపై అధికారులను సీఎం వివరాలు అడిగారు. అర్జెంట్ రిపేర్లు చేయాల్సిన పనుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఈ నెలాఖరికల్లా టెండర్లు పూర్తి చేసి 8268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మత్తులు వెంటనే మొదలుపెడుతున్నట్లు అధికారుల సీఎంగా తెలిపారు.
Also Read : కుప్పంలో రచ్చ - మిగతా చోట్ల చెదురుమదురు ఘటనలు .. ముగిసిన ఏపీ మినీ లోకల్ వార్
అయితే మొత్తం 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకోవాలని.. ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. వర్షాలు తగ్గగానే డిసెంబర్ నుంచి జూన్ వరకు అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్‌లు కూడా కవర్ చేయాలని..న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు.
ఏ రోడ్డు అయినా సరే మునిసిపాలిటీ, కార్పొరేషన్ అయినా సరే ఎవరి పరిధిలో ఉన్నా వెంటనే మరమ్మత్తులు చేయాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు, మెయింటెనెన్స్ మీద ముందు దృష్టి పెట్టండి, నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సూచించారు. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో ఈ లోపు ఏపీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్ట్‌ల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?