నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరాటాలతో తంటాలు పడుతున్న రోజా పార్టీలోని ప్రత్యర్థులు తనపై పైచేయి సాధించకుండా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పార్టీ నేతలు సహాయ నిరాకరణ చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమిళుల్ని ఆకట్టుకునేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తమిళ ఆరాధ్య నటుడు శివాజీ గణేషన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 


Also Read : గెలిచిన జడ్పీటీసీలు ఇద్దరు.. ఒకరు రాజీనామా.. జనసేనలో విచిత్ర పరిస్థితి !


నగరి నియోజకవర్గంలో లక్ష మందికిపైగా ఓటర్లు తమిళులే. తమిళనాడు సరిహద్దుల్లో నగరి నియోజకవర్గం ఉండటంతో  రాష్ట్ర విభజన సమయంలో వారంతా నగరిలోనే ఉండిపోయారు. నగరిలో భాగం అయినా వారంతా తమిళ సంస్కృతి, తమిళ భాషతోనే  జీవనం సాగిస్తూ ఉంటారు. వారికి తమిళ హీరోలే అసలు హీరోలు. వారు ఎవరి వైపు మొగ్గితే వారికే విజయం దక్కుతూ ఉంటుంది. అందుకే తన నియోజకవర్గంలోని తమిళుల్ని ఆకట్టుకునేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తూంటారు. ఈ సందర్భంగా శివాజీ గణేషన్ జయంతి రావడంతో రోజా వర్గీయులు ఘనంగా నిర్వహించారు. ఆమె ప్రత్యర్థులు కూడా పోటీగా నిర్వహించారు.  


Maa AP Govt : "మా" ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వడం లేదు.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన !


నగరిలో రోజా రెండు సార్లు గెలవడానికి ప్రధాన కారణం తమిళ ఓటర్లే. రోజా భర్త సెల్వమణి, తమిళ ఉద్యమాల్లో ఆయన ఉంటారు. ఈ కారణంగా తమిళ ఓటర్లు రోజా వైపు మొగ్గు చూపారు. అయితే ఈ సారి వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. రోజా ప్రత్యర్థులు అయిన చక్రపాణిరెడ్డి, నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వంటి వారు తమిళ ప్రజల్లో పలుకుబడి సాధిస్తున్నారు. రోజా శివాజీ గణేషన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినా.. ఆయన కుమారుడు, తమిళనటుడు ప్రభు ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తూ కేజే కుమార్ ఇంట ఆతిధ్యం స్వీకరించారు. ఇది రోజాకు ఇబ్బందికరంగా మారింది. 


TDP Budvel : అభ్యర్థిని ప్రకటించి మరీ వెనక్కి తగ్గిన టీడీపీ ! సంప్రదాయమా ? పలాయనమా ?


రోజాకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డితో సన్నిహితంగా ఉండే నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని ఎదుర్కొని తన పట్టు నిలబెట్టుకునేందుకు రోజా చేయాల్సిన కసరత్తు చేస్తున్నారు. రోజాను ఒంటరిని చేసి తమిళ ఓట్లు దక్కుకుండా ప్రయత్నాలు సాగిస్తున్న క్రమంలో రోజా భర్త సెల్వమణిని రంగంలోకి దించుతున్నారు. ఈయన స్ధానికంగా పర్యాటనలు చేస్తూ తమిళులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఎవరిది పై చేయి అవుతుందో కానీ రోజా ఎన్నికల్లో టీడీపీతో పోటీ పడాలేమో కానీ ఐదేళ్లు పార్టీలోని అంతర్గత రాజకీయాలతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. 


Watch Video : Badvel Bypoll: బద్వేల్ ఉపఎన్నికను బహిష్కరిస్తున్నాం...



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి