ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 30,515 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 429 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,53,192 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 4 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,208కు చేరింది. తాజాగా 1029 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,29,231కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 9753 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,76,467 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాతో గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.










Also Read: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం


తెలంగాణలో కొత్త కేసులు


తెలంగాణలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రెండు కరోనాతో మరణించినట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు వెల్లడించింది. తాజాగా 239 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,421కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 43,135 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. 


దేశంలో కొత్త కేసులు


దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 20,799 కేసులు నమోదుకాగా 180 మంది చనిపోయారు. 26,718 మంది కరోనా నుంచి రికవరయ్యారు. గత 200 రోజుల్లో ఇవే రోజువారి అత్యల్ప కేసులు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 97.89%కి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.



  • యాక్టివ్ కేసులు: 2,64,458

  • మొత్తం రికవరీలు: 3,31,21,247

  • మొత్తం మరణాలు: 4,48,997

  • మొత్తం వ్యాక్సినేషన్: 90,79,32,861


Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?


కేరళ, మహారాష్ట్రలో 


కేరళలో కొత్తగా 12,297 కరోనా కేసులు నమోదుకాగా 74 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 47,20,233కి పెరిగింది. మృతుల సంఖ్య 25,377కు చేరింది. మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో (1,904) అత్యధిక కేసులు నమోదయ్యాయి. త్రిస్సూర్‌లో (1,552), తిరువనంతపురలో (1,420), కోజికోడ్‌లో (1,112) కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహాలో కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 2,692 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. 2,716 మంది బాధితులు రికవరయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Also Read: దేశంలో కొత్తగా 20,799 కేసులు నమోదు.. గత 200 రోజుల్లో ఇవే అత్యల్పం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి