ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేన గెలిచిన రెండు జడ్పిటీసీల్లో  ఒకటి మైనస్ అయింది. గెలిచిన వారు ఇతర పార్టీల్లో చేరలేదు కానీ రాజీనామా చేశారు. తప్పక  రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్‌లో తూర్పుగోదావరి జిల్లా కడియం. మండలం నుంచి జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా  మార్గాని అమ్మాణి ఏడుకొండలు విజయం సాధించారు. రెండు వేలకుపైగా ఓట్ల మెజార్టీ ఆమె సాధించారు.  అయితే ఆ పదవికి ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఇప్పటికే ఆమె సర్పంచ్‌గా ఉన్నారు. 


Maa AP Govt : "మా" ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వడం లేదు.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన !


మార్గాని అమ్మాణి మొదటగా జడ్పీటీసీగానే పోటీ చేయాలనుకున్నారు.  2020 మార్చిలో ఆమె జెడ్పీటీసీ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆ ఎన్నకలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరుగుతాయో తెలియదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవికి పోటీ చేశారు.  జడ్పీటీసీగా గెలిచినప్పటికీ సర్పంచ్‌గా కొనసాగాలని గ్రామస్తులు షరతు పెట్టారు . దానికి ఆమె అంగీకరించారు.  ఆ ఎన్నికలలో గ్రామస్తులు 2400 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లోనూ  అమ్మాణి ఏడుకొండలు 2301 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 


Budvel By Election : బద్వేల్ ఏకగ్రీవమా ? నామమాత్ర పోటీనా ?


సర్పంచ్‌గా జడ్పీటీసీగా గెలవడంతో ఏదో ఓ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం సర్పంచ్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీ ముఖ్యులకు కూడా ఈ సమాచారం ఇచ్చారు. వారి ఆమోదంతో కాకినాడ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్ కు రాజీనామా పత్రం అందజేశారు.  ఎవరైనా రాజీనామా చేయమని వత్తిడి చేసారా ? అని కలెక్టర్ ఆమెను ప్రశ్నించారు. ఎవరు వత్తిడి లేదని పంచాయతీ ఎన్నికలలో గ్రామస్తులకు ఇచ్చిన హమీ మేరకు సర్పంచిగానే  కొనసాగుతానని అమ్మాణి కలెక్టర్‌కు వివరించారు. 


TDP Budvel : అభ్యర్థిని ప్రకటించి మరీ వెనక్కి తగ్గిన టీడీపీ ! సంప్రదాయమా ? పలాయనమా ?


కడియం మండలంలో జనసేన పార్టీకి తిరుగులేని ఆదరణ ఉందని.. మళ్లీ జడ్పీటీసీకి ఎన్నికలు జరిగితే జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆ మండలంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. కడియం మండల ఎంపీపీ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు జనసేన స్థానిక నేతలు. గెలిచిన రెండు జడ్పీటీసీల్లో ఒకరు రాజీనామా చేయాల్సి రావడం జనసైనికులను నిరాశ పరుస్తోంది.  


Watch Video : Badvel Bypoll: బద్వేల్ ఉపఎన్నికను బహిష్కరిస్తున్నాం...



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి