ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల ప్రారంభం తల్లిదండ్రలకు లేనిపోని టెన్షన్ తెచ్చి పెడుతోంది. సీజన్ వ్యాధులకు తోడు కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూండటంతో విద్యార్థుల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభించారు. కరోనా కట్టడికి అన్ని రకాల కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించి స్కూళ్లు నడుపుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోది. Also Read : వివేకా హత్య కేసులో హంతకులు వాళ్లిద్దరేనా..?


ఏపీలో కరోనా కేసుల హెచ్చు తగ్గులు టెస్టులను బట్టి నమోదవుతున్నాయి. సగటున రోజుకు వెయ్యి కేసులు వెలుగుచూస్తున్నాయి. వరిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రతి జిల్లాలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాలు కూడా కరోనా బారిన పడుతున్నారు.  దీంతో తల్లిదండ్రులు భయం గుప్పిట్లోనే విద్యార్థులను స్కూళ్లకు పంపుతున్నారు. ఉపాధ్యాయులు సైతం బిక్కుబిక్కుమంటూనే ప్రత్యక్ష పద్ధతిలో బోధనలు చేస్తున్నారు. గత నెలలో పాఠశాలల్లో ఒకటి రెండు కరోనా కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తుంది.Also Read : కడపలో ముస్లిం ఫ్యామిలీ సూసైడ్ ఆవేదన..!


నెల్లూరు, గుంటూరు, గోదావరి  జిల్లాల్లో ఈ కేసుల సంఖ్యగా అధికంగా ఉంటోంది. ఇప్పటికీ దేశంలో కరోనా ప్రభావం తగ్గలేదు.  ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు గురుకులాల్లోనూ వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న చోట్ల స్కూళ్లను మూసివేయాలన్న ఆదేశాలున్నాయి కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పట్టుదలకు పోయి విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నారు. Also Read : కడప జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు


తెలంగాణలో కూడా స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ హైకోర్టు విద్యా సంస్థలకు స్టూడెంట్స్ రావడం వారి తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేయాలని తీర్పు చెప్పింది. ఈ కారణంగా తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ విద్యార్థుల స్కూళ్లలోని పరిస్థితుల్ని బట్టి నిర్మయం తీసుకుంటున్నారు.  ఏపీలో మాత్రం ఇలాంటి ఆంక్షలేవీ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరి పరిస్థితుల విద్యాసంస్థలకు పంపుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులపై ప్రభుత్వం పునరాలోచించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం అలా పునరాలోచించే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Also Read : ఏపీలో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు