వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు సంచలనాత్మక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య కేసులో రెండో వ్యక్తిగా అరెస్ట్ చేసిన ఉమాశంకర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు కీలకమైన విషయాలు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సునీల్‌తో కలిసి ఉమాశంకర్ రెడ్డి కుట్ర చేశారని.. దానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని రిమాండ్ రిపోర్టుోల పేర్కొన్నారు. సునీల్ యాదవ్‌ను గతంలో పది రోజులు కస్టడీకి తీసుకున్నారు.  ఈసందర్భంగా ప్రశ్నించినప్పుడు ఉమాశంకర్ రెడ్డికి సంబంధించిన కీలకమైనవి విషయాలను వెల్లడించారని... హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి పాత్రను వెల్లడించారని పేర్కొన్నారు. Also Read : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎపీపీఎస్సీ పరీక్షలు


అలాగే వాచ్‌మెన్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఉమాశంకర్ రెడ్డి గురించి చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య చేయడానికి ముందు ఇద్దరూ కలిసి ఆయన ఇంటి పెంపుడు కుక్కను చంపారని సీబీఐ అధికారులు చెబుతున్నారు. కావాలని కారును తీసుకెళ్లి కుక్కను ఢీకొట్టి చంపారని.. హత్యకు ముందు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి బైకుపై కలిసి వెళ్లారని పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత ఉమాశంకర్ రెడ్డి పల్సర్ బైక్‍లో గొడ్డలి పెట్టుకొని పారిపోయాడని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. Also Read : దళిత బంధుపై మరోసారి కేసీఆర్ దృష్టి


ఉమాశంకర్ రెడ్డికి సంబంధించిన బైక్, గొడ్డలి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటికి సంబంధించి  గుజరాత్ నుచి ఫోరెన్సిక్ నివేదిక కూడా తెప్పించామని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.  గత నెల 11న ఉమాశంకర్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి రెండు చొక్కాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. మరికొందరు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది. ఇంకా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని.. ఉమాశంకర్ రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టుతో పాటు సీబీఐ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. Also Read : వ్యాక్సిన్స్ మోసుకొస్తున్న డ్రోన్స్
 
ఇప్పటికి ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ముగ్గురు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాచ్‌మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిలతో పాటు కృష్ణమాచారి వాంగ్మూలాలు కూడా నమోదు చేయించారు.  కృష్ణమాచారి ఆయుధాలు అమ్మిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వైఎస్ కుటుంబసభ్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మూడు రోజుల కిందట సీబీఐ ఎదుట హాజరయ్యారు. త్వరగా తేల్చాలని సీబీఐ అధికారుల్ని కోరినట్లుగా ఆయన తెలిపారు. రిమాండ్ రిపోర్టు చూస్తే ప్రధానంగా సునీల్ యాదవ్, ఉమామహేశ్వరర్ రెడ్డిలే హత్య చేసినట్లుగా సీబీఐ అంచనాకు వచ్చినట్లుగా తెలు్సతోంది. 


Also Read : 'అఫ్గాన్- లగాన్'కి లింకేంటి.. తాలిబన్లపై భారత్ 'స్టాండ్' ఏంటి?