Jagananna Smart Township: మధ్య ఆదాయ వర్గాల కోసం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం వేసిన ప్రణాళికకు చక్కెదురైంది. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో భూములు ఇచ్చేందుకు స్థిరాస్తి వ్యాపారులు ముందుకు రావడం లేదు. పట్టణాభివృద్ధి సంస్థలు ఇచ్చిన ప్రకటనలకు స్పందన రాలేదు. ఏ ఒక్కరూ ఇందుకు దరఖాస్తు చేయలేదు. మధ్య ఆదాయ వర్గాల కోసం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రారభించింది. 7 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 14 చోట్ల ఎజీఐ లేఅవుట్లలో స్థలాల కోసం ప్రస్తుతానికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వకీరిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారుల కటే తక్కువ ధరకు, అన్ని మౌలిక సదుపాయాలు కల్గిర లేఅవుట్ల కోసం ప్రస్తుతానికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
గత నెలలో కొన్ని దరఖాస్తులు వచ్చాయి.. కానీ
స్థిరాస్తి వ్యాపారుల కంటే తక్కువ ధరకు, అన్ని మౌలిక సదుపాయాలు కల్గి లేఅవుట్ల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల నుంచి స్పందన బాగుందని అసెంబ్లీ నియోజకవర్గానికి స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే పట్టణాలకు సమీపంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. భూముల ధరలు ఎక్కువగా ఉన్నటోచ వాటికి సేకరించి ప్రజలకు అందుబాటు ధరల్లో స్థలాలు విక్రయించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానంలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లకు కనీస 20 ఎకరాలకు తక్కువ కాకుండా భూములు ఇచ్చే వ్యాపారుల నుంచి పట్టణాభివృద్ధి సంస్థలు గత నెలలో దరఖాస్తులు వచ్చాయి.
వంద ఎకరాలు ఇచ్చేందుకు ఎవరూ రావట్లే..!
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ, తిరుపతి అన్నమయ్య పట్టణాభివృద్ది సంస్థల పరిధిలోనూ వ్యాపారుల నుంచి స్పందన లేదు. 17 పట్టణాభివృద్ధి సంస్థల్లో 350 నుంచి 500 ఎకరాల్లో స్మార్ట్ టౌన్ షిప్ ల ఏర్పాటుకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికీ 100 ఎకరాలు ఇచ్చేదుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. వ్యాపారుల నుంచి సేకరించిన భూముల్లో వేసే లేఅవుట్లలో కనీసం 40 శాతం విస్తీర్ణంలోని ఇళ్ల స్థలాలను మధ్య ఆదాయ వర్గాలకు పట్టణాభివృద్ధి సంస్థలు విక్రయించనున్నాయి. కొనుగోలు దారులు చెల్లించిన మొత్తాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అందులోంచి 4 శాతం వివిధ రుసుముల కింద మినహాయించి మిగిలిన 96 శాతం వ్యాపారులకు చెల్లించనున్నారు.
మొత్త వ్యాపారంలో 18 జీఎస్టీ చెల్లించాలి..
అయితే వీటిని ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందో లేదో అనే అనుమానం వ్యాపార మార్గాల్లో వ్యక్తం అవుతుంది. వ్యాపారుల్లో ఎక్కువ మంది రైతుల నుచి అనుమతులు పొందుతున్నారు. ఒకేసారి 20 ఎకరాలు, ఆపైన రైతుల నుంచి కొని యాజమాన్య హక్కులు పొందేది తక్కువ. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కోసం కనీసం 20 ఏకరాలకు రైతులతో ఒప్పందం చేసుకొని పట్టణాభివృద్ధి సస్థతో మరోసారి ఒప్పందం అంటే మొత్తం వ్యాపార విలువలో 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది భారం అవుతుందని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.
Jagananna Smart Township: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌నకు చుక్కెదురు, వాళ్లు ముందుకు రాకపోవడంతో తప్పని చిక్కులు
ABP Desam
Updated at:
05 Sep 2022 11:37 AM (IST)
Jagananna Smart Township: 7 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 14 చోట్ల ఎజీఐ లేఅవుట్లలో స్థలాల కోసం ప్రస్తుతానికి ప్రజల నుంచి దరఖాస్తులు స్వకీరిస్తున్నారు.
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్
NEXT
PREV
Published at:
05 Sep 2022 11:37 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -