Andhra News Ramana Dikshitulu :    తిరుమల ఆలయం సనాతన వ్యతేరిక అధికారి, ప్రభత్వం  కబంధ హస్తాల్లో ఉందని.. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రమణ దీక్షితులు విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాల పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను టీటీడీలోని సనాతన అధికారి క్రమ పద్ధతిలో నాశనం చేస్తున్నాడని పేర్కొన్నారు. దయచేసి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఇక్కడ వెంటనే హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని కోరారు.  దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని మోదీకి రమణ దీక్షితులు ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 


ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగాతన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి  రమణదీక్షితులు ఈ కామెంట్ చేసారు. 


 





 
రమణదీక్షితులు ఇలా నేరుగా ప్రభుత్వంపై ప్రధానికి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఆయన ఎలాంటి విమర్శలు చేయలేదు. టీటీడీ అధికారులపై మాత్రమే విరుచుకుపడుతూ వస్తున్నారు. సీఎం జగన్ కు ఫిర్యాదులు , విజ్ఞప్తులు చేస్తున్నారు. తొలి సారి ఆయన  ప్రభుత్వ కూడా సనాతనానికి వ్యతిరేకంగా ఉందని ప్రధానికి ఫిర్యాదు చేశారు.                        


2019లో ఎన్నికలకు ముందు రమణదీక్షితులు  తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండేవారు. కానీ అప్పటిప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ అని. పోటులో తవ్వకాలు అని.. చెన్నై, హైదరబాద్, బెంగళూరు వంటి చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఆయనకు అర్చక వృత్తి నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇంటికి వెళ్లారు. తమ ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో ప్రధాన అర్చక పదవి మళ్లీ ఇస్తామని హామీ పొందారు. కానీ ఐదేళ్లు ్వుతున్నా ఇప్పటికీ ఆయనకు ఎలాంటి ఊరట లభించలేదు. కంటి తుడుపుగా ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఆయనకు ఆలయంలో ప్రవేశంలో లేదు. ఈ కారణంగా అసంతృప్తికి గురవుతున్నారు.                          


వంశపారంపర్య అర్చకుల శాశ్వత నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. తితిదే అర్చకులు, భక్తుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.- ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రమణదీక్షితులు అసంతృప్తికి గురవుతున్నారు.