Filmfare OTT Awards 2023 Telugu: ఫిల్మ్‌ ఫేర్ OTT అవార్డ్స్ 2023 ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఒరిజినల్ ఫిల్మ్ విభాగంలో మనోజ్ బాజ్‌పాయ్, అలియా భట్ ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.  వెబ్ సిరీస్ ల విభాగంలో ‘జూబ్లీ’, ‘కొహ్రా’ అత్యధిక అవార్డులను అందుకున్నాయి. ‘మోనికా ఓ మై డార్లింగ్’ మూవీస్ విభాగంలో పలు అవార్డులను అందుకుంది. విక్రమాదిత్య మోత్వానే రూపొందించిన ‘జూబ్లీ’ టాప్ సీడ్స్‌ లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఒరిజినల్ సౌండ్‌ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ VFX సహా 5కు పైగా విభాగాల్లో అవార్డులను అందుకుంది.  ‘కొహ్రా’, ‘స్కూప్’, ‘డార్లింగ్స్’, ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’, ‘జహాన్’కు సైతం పలు అవార్డులు దక్కాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో పాల్గొన్నారు.


ఫిల్మ్‌ ఫేర్ OTT అవార్డ్స్ 2023 విన్నర్స్ లిస్ట్ ఇదే


సిరీస్ అవార్డులు


ఉత్తమ నటుడు (మేల్)- సుర్విందర్ విక్కీ – ‘కొహ్రా’


ఉత్తమ నటి (ఫిమేల్)- రాజశ్రీ దేశ్‌పాండే – ‘ట్రయల్ బై ఫైర్’


ఉత్తమ దర్శకుడు - విక్రమాదిత్య మోత్వానే – ‘జూబ్లీ’


ఉత్తమ సిరీస్ – ‘స్కూప్’


క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ సిరీస్ – ‘ట్రయల్ బై ఫైర్’


క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ దర్శకుడు - రణదీప్ ఝా – ‘కొహ్రా’


క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ (ఫిమేల్), డ్రామా - కరిష్మా తన్నా – ‘స్కూప్’


క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ (ఫిమేల్), డ్రామా - సోనాక్షి సిన్హా – ‘దహాద్’


క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ (మేల్), డ్రామా - విజయ్ వర్మ – ‘దహాద్’


ఉత్తమ ఒరిజినల్ స్టోరీ - గుంజిత్ చోప్రా, డిగ్గీ సిసోడియా – ‘కొహ్రా’


ఉత్తమ ఒరిజినల్ డైలాగ్ - కరణ్ వ్యాస్ – ‘స్కూప్’


ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – గుంజిత్ చోప్రా, సుదీప్ శర్మ,  డిగ్గీ సిసోడియా – ‘కొహ్రా’


ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - అపర్ణా సుద్,  ముకుంద్ గుప్తా – ‘జూబ్లీ’


ఉత్తమ ఎడిటింగ్ - ఆర్తి బజాజ్ – ‘జూబ్లీ’


ఉత్తమ సినిమాటోగ్రఫీ - ప్రతీక్ షా – ‘జూబ్లీ’


ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - శృతి కపూర్ - ‘జూబ్లీ’


ఉత్తమ VFX - అర్పన్ గగ్లానీ - ‘జూబ్లీ’


ఉత్తమ నేపథ్య సంగీతం - అలోకానంద దాస్‌గుప్తా - ‘జూబ్లీ’


ఉత్తమ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ – అమిత్ త్రివేది, కౌసర్ మునీర్ – ‘జూబ్లీ’


ఉత్తమ సౌండ్ డిజైన్ - కునాల్ శర్మ, ధృవ్ పరేఖ్ - ‘జూబ్లీ’


ఉత్తమ సహాయ నటి (ఫిమేల్), కామెడీ - షెర్నాజ్ పటేల్ – ‘TVF ట్రిప్లింగ్ S3’


ఉత్తమ సహాయ నటుడు (మేల్), కామెడీ - అరుణాభ్ కుమార్ – ‘TVF పిచర్స్ S2’


ఉత్తమ నటి (ఫిమేల్), కామెడీ - మాన్వి గాగ్రూ – ‘TVF ట్రిప్లింగ్ S3’


ఉత్తమ నటుడు (మేల్), కామెడీ - అభిషేక్ బెనర్జీ – ‘ది గ్రేట్ వెడ్డింగ్స్ ఆఫ్ మున్నెస్’


ఉత్తమ సహాయ నటి (ఫిమేల్), డ్రామా - తిలోటమా షోమ్ – ‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 2’


ఉత్తమ సహాయ నటుడు (మేల్), డ్రామా - బరున్ సోబ్తి - ‘జూబ్లీ’


ఫిల్మ్ అవార్డులు


ఉత్తమ నటుడు (మేల్) - మనోజ్ బాజ్‌పేయి – ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’


ఉత్తమ నటి (ఫిమేల్) - అలియా భట్ – ‘డార్లింగ్స్’


ఉత్తమ దర్శకుడు - అపూర్వ్ సింగ్ కర్కీ – ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’


ఉత్తమ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ – ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’


క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ – ‘వాసన్ బాలా’,‘మోనికా ఓ మై డార్లింగ్’


క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి (ఫిమేల్) - షర్మిలా ఠాగూర్ – ‘గుల్మోహర్’


క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి (ఫిమేల్) - సన్యా మల్హోత్రా – ‘కథల్’


క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటుడు (మేల్) - రాజ్‌కుమార్ రావు – ‘మోనికా ఓ మై డార్లింగ్’


ఉత్తమ కథ - దీపక్ కింరానీ – ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’


ఉత్తమ సినిమాటోగ్రఫీ - స్వప్నిల్ సోనావానే – ‘మోనికా ఓ మై డార్లింగ్’


ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – అగర్వాల్ మీటింగ్ – డిజైన్


ఉత్తమ ఎడిటింగ్ - నితిన్ బైడ్ – ‘డార్లింగ్స్’


ఉత్తమ సౌండ్ డిజైన్ - అనిర్బన్ సేన్‌గుప్తా - ‘డార్లింగ్స్’


ఉత్తమ నేపథ్య సంగీతం - అచింత్ ఠక్కర్ – ‘మోనికా ఓ మై డార్లింగ్’


ఉత్తమ నటి (ఫిమేల్), షార్ట్ ఫిల్మ్ - మృణాల్ ఠాకూర్ – ‘జహాన్’


ఉత్తమ నటుడు (మేల్), షార్ట్ ఫిల్మ్ - మానవ్ కౌల్ – ‘ఫిర్ కభి’


పాపులర్ ఛాయిస్ అవార్డు - ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – ‘సోల్ కాధి’


ఉత్తమ షార్ట్ ఫిల్మ్, ఫిక్షన్ – ‘జహాన్’


ఉత్తమ సహాయ నటి (ఫిమేల్) - షెఫాలీ షా – ‘డార్లింగ్స్’


ఉత్తమ సహాయ నటి (ఫిమేల్) - అమృతా సుభాష్ – ‘ది మిర్రర్’,  ‘లస్ట్ స్టోరీస్ 2’


ఉత్తమ సహాయ నటుడు (మేల్) - సూరజ్ శర్మ – ‘గుల్మోహర్’


Read Also: స్పెల్లింగ్ మారింది - రౌడీ బ్రాండ్‌ను రీ లాంఛ్ చేస్తున్న విజయ్ దేవరకొండ


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply