Vijay Devarakonda clothing brand: 'ది' విజయ్ దేవరకొండ సక్సెస్ ఫుల్ హీరో. పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ ముద్దుగా 'రౌడీ బాయ్' అని పిలుస్తూ ఉంటారు. ఆయన అభిమానులను 'రౌడీస్' అంటుంటారు.
యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ... ఫ్యాషన్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని సొంత రౌడీ క్లాత్ బ్రాండింగ్ ద్వారా చూపిస్తున్నారు. 'రౌడీ క్లాత్' బ్రాండింగ్ ఇప్పటికే యువతలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఆ బ్రాండ్‌ను 'రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్' పేరుతో రీ లాంఛ్ చేస్తున్నారు.
డిసెంబర్‌లో 'రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్'
డిసెంబర్ నెలలో 'రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్' రీ లాంఛ్ కాబోతోంది. ఫ్యాషన్ రంగంలో ఇండియన్ ఆధిపత్యాన్ని రౌడీ క్లాత్ బ్రాండింగ్ ముందుకు తీసుకెళ్తుందని సగర్వంగా ప్రకటించారు విజయ్ దేవరకొండ. ఈ క్లాతింగ్ బ్రాండ్ రేట్స్, వివరాలు ప్రస్తుతానికి ప్రకటించలేదు. ఎర్లీ యాక్సెస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇచ్చారు.
Also Read: చిరంజీవిపై పరువు నష్టం దావా... మన్సూర్ అలీ ఖాన్, త్రిష కేసులో కొత్త ట్విస్ట్
సంక్రాంతికి 'ఫ్యామిలీ స్టార్' వస్తుందా? లేదా?
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలకు వస్తే... 'గీత గోవిందం' తర్వాత ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్లతో మరో సినిమా చేస్తున్నారు. దానికి 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ ఖరారు చేశారు. అందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఆ చిత్రాన్ని 'దిల్' రాజు నిర్మిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్'ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. అయితే... ప్రస్తుత పరిస్థితులను చూస్తే వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కావడం కష్టం అని టాక్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
Also Read: ది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?
'మళ్ళీ రావా', 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ స్పై థ్రిల్లర్ కూడా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా సినిమా ఒకటి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించే సినిమా మాఫియా నేపథ్యంలో 80వ దశకంలో సాగే కథతో రూపొందుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం. ఈ సినిమాకు 'యుద్ధం' అనే టైటిల్ ఖరారు చేశారట.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply