Uttarakhand Tunnel Rescue Updates:
ఇండియన్ ఆర్మీ సహకారం..
ఉత్తరాఖండ్ సొరంగంలో (Uttarakhand Tunnel Collapse) చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఇంకా సమయం పట్టేలా ఉంది. అమెరికా నుంచి Augur Machine తెప్పించి డ్రిల్లింగ్ చేసినా అది సక్సెస్ కాలేదు. మెషీన్ బ్లేడ్‌లు విరిగిపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. మరో సారి వర్టికల్ డ్రిల్లింగ్ చేపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇప్పటికే పలువురు నిపుణులు వచ్చారు. వీళ్లతో పాటు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా ఇందులో పాల్గొంటోంది. దాదాపు రెండు వారాలుగా సహాయక చర్యలు (Silkyara Tunnel Rescue) కొనసాగుతున్నప్పటికీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. వర్టికల్ డ్రిల్లింగ్‌తో పాటు మాన్యువల్ డ్రిల్లింగ్‌నీ చేపడుతున్నారు. ఈ మాన్యువల్ డ్రిల్లింగ్‌కి ఇండియన్ ఆర్మీ (Indian Army Manual Drilling) సహకారం అందిస్తోంది. డ్రిల్లింగ్ చేస్తుండగా ఆగర్ మెషీన్ బ్లేడ్‌లు ఆ శిథిలాల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడా బ్లేడ్స్‌ని ఒక్కొక్కటిగా తొలగిస్తోంది రెస్క్యూ సిబ్బంది. మరో 10-15 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం హ్యాండ్ టూల్స్‌ని వినియోగిస్తున్నారు. మాన్యువల్ డ్రిల్లింగ్‌లో భాగంగా ఇప్పటికే ఉన్న రెస్క్యూ పాసేజ్‌లోకి ఓ వ్యక్తి వెళ్తాడు. కొంత వరకూ మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తాడు. ఆ తరవాత మరొకరు లోపలికి వెళ్తారు. ఇలా వంతుల వారీగా డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. ఇదంతా ఇండియన్ ఆర్మీనే చేయనుంది.
360 గంటలుగా సొరంగంలోనే..
భారత సైన్యానికి చెందిన ఇంజనీర్ గ్రూప్ రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం అందిస్తోంది. ఇప్పటికి కార్మికులు సొరంగంలో చిక్కుకుని 360 గంటలు. అయితే...వీళ్లను బయటకు తీసుకురావడానికి మరి కొన్ని వారాల సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతానిక కార్మికులంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఎండోస్కోపిక్ కెమెరా పైప్ ద్వారా పంపించి కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడిస్తున్నారు. వాళ్లు ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటన్నారు. పైప్ ద్వారానే ఆక్సిజన్, ఆహారం అందిస్తున్నారు. కొండప్రాంతం కావడం వల్ల ఎప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయో చెప్పలేమని అంటున్నారు నిపుణులు. అందుకే కచ్చితంగా ఇన్ని రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తైపోతుందని చెప్పలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ఆర్నాల్డ్ డిక్స్ (Arnold Dix) ఘటనా స్థలంలోనే ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు మరో నెల రోజుల సమయం పడుతుండొచ్చని అంచనా వేశారు. ఎప్పటికి ఇది పూర్తవుతుందో చెప్పలేమని, గరిష్ఠంగా ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రమే తాను చెబుతున్నానని వివరించారు. ఈ డ్రిల్లింగ్ కోసం కనీసం 20 మంది సిబ్బంది పని చేయనున్నారు.
Also Read: Kerala Stampade: కొచ్చి వర్సిటీలో తొక్కిసలాటకు కారణాలివే, కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply