krishna mukunda murari serial today Episode : భవాని తనతో మాట్లాడిన మాటలు తలచుకొని కృష్ణ బాధ పడుతూ వస్తుంది. ఇంతలో అక్కడికి మురారి వచ్చి తన పెద్దమ్మ ఏం చెప్పింది అని ప్రశ్నించాడు. కృష్ణ కవర్ చేస్తుంది. అందుకు తన ఫ్యామిలానే అందరూ తన దగ్గర అన్ని దాచేస్తున్నారు అని మురారి బాధ పడతాడు. టిఫిన్ చేయమని తీసుకొస్తాడు. ఈ టిఫిన్ మీరు చేస్తూ ఉండండి నేను ఇంట్లో వాళ్లను అడిగి వస్తానని వెళ్తాడు.
భవాని: మనసులో .. ఇప్పుడు మరారికి వాడికి అర్థమయ్యేలా అర్థం చేసుకునేలా ఈ విషయాన్ని చెప్పాలి. తప్పదు అనుకున్నా తప్పు అనుకున్నా అబద్ధం చెప్పి తీరాలి. వంద అబద్ధాలు ఆడి అయినా సరే ఓ పెళ్లి చేయమంటారు. వాడి జీవితం బాగు పడటానికి ఒకటి రెండు అబద్ధాలు చెప్పినా పర్లేదు.
రేవతి: అక్కా.. మీరు తీసుకున్న నిర్ణయం సరైందో కాదో ఒక్కసారి ఆలోచించండి అక్క
భవాని: రేవతి నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికే ఎక్కవ ఆలోచిస్తాను తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడానికి అస్సలు ఆలోచించను. చూడు రేవతి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నువ్వే కాదు, కృష్ణ మురారి జంట చూసి నేను కూడా మురిసి పోయాను. నందూని ఓ మనిషిని చేసి అది కోరుకున్న వాడితో నన్ను ఎదిరించి వాళ్ల పెళ్లి చేసి నందూ జీవితాన్ని సార్థకం చేసింది. మరి మురారి జీవితాన్ని ఏం చేసింది రేవతి. ఒకసారి ఆలోచించు
రేవతి: మీరు చెప్పినట్లు అన్ని మంచి పనులు చేసిన కృష్ణ కట్టుకున్న భర్త విషయంలో అలా ఎందుకు చేస్తుంది అక్క ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి.
భవాని: ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకుంటానా ఒక్క మాట అడుగుతాను రేవతి గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పు. మురారి చనిపోయాడు అని వాడి బాడీని ఎందుకు పంపించినట్లు.. మనం అంటే ప్రాణం ఇచ్చే కృష్ణవేణి మురారి బతికిఉన్నాడు. వాడికి యాక్సిడెంట్ అయిందని మనకు ఎందుకు చెప్పలేదు. రేవతి ముకుంద కనిపెట్టకపోయింటే నీ కొడుకు ఫొటోకి..
రేవతి: అక్కా..
భవాని: కదా వినలేకపోయావు కదా మరి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టిందో చెప్పు
రేవతి: కానీ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అక్కా
భవాని: కొన్ని కొన్ని అంతే రేవతి అది వాళ్ల తప్పు కాదు నమ్మిన మన తప్పు
రేవతి: అవును రేపు మురారికి పెళ్లి అయిన తర్వాత గతం గుర్తొస్తే.
భవాని: అందుకేగా అమెరికా ప్లాన్ క్యాన్సిల్ చేసింది
మురారి: (అప్పుడే అక్కడికి వచ్చి) పెద్దమ్మ వేణిగారిని ఏమైనా అన్నారా అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు తనని మన ఇంటికి టిఫిన్‌కు పిలిచారు. నేను లేని టైంలో. అంత రహస్యంగా ఎందుకు పిలవాల్సి వచ్చింది. ఎందుకు తనని బాధ పెట్టాల్సి వచ్చింది. నువ్వైనా చెప్పు అమ్మ వేణి గారిని ఎందుకు పిలిచారు.
రేవతి: అదీ..
భవాని: నువ్వు ఉండు రేవతి
మురారి: అదేంటి పెద్దమ్మ అమ్మని చెప్పనివ్వండి
భవాని: నేను చెప్తా అంటున్నా కదా
మురారి: అమ్మని చెప్పనివ్వండి పెద్దమ్మ
భవాని: ఏంటి మురారి ఆర్గ్యూ చేయడానికి ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావ్. ఆ వేణిని నేను ఏం అనలేదు. అనాల్సిన అవసరం నాకు లేదు. తను చేసిన దానికి మళ్లీ ఇలా చేయకు అని అన్నాను అంతే. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళ్లి పోయింది.
మురారి: నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు
భవాని: అవును మురారి దాస్తున్నాం..
మురారి: ఎందుకు దాస్తున్నారు.. దాయాల్సిన అవసరం ఏంటి
భవాని: అవసరం ఉంది మురారి అన్నీ విషయాలు వివరంగా చెప్తా ఒక రెండు రోజులు ఆగు.. అప్పుడు మా పట్ల ఆ వేణి పట్లు నీకు అవగాహన వస్తుంది
మురారి: రెండు రోజులు ఎందుకు ఇప్పుడే చెప్పండి
మరోవైపు ఏసీపీ గారు కోపంగా ఉన్నారు. అక్కడ ఏం జరిగి ఉంటుందా ఏమో అని కృష్ణ, తన పిన్ని టెన్షన్ పడుతుంటారు. ఇక మురారి అక్కడికి రావడంతో ఏం జరిగింది అని కృష్ణ అడుగుతుంది. పెద్ద మేడంతో గొడవ పడ్డారా అని అడుగుతుంది. ఎంత అడిగినా పెద్దమ్మ ఏం చెప్పలేదని.. రెండు రోజులు ఆగమని చెప్పిందని చెప్తాడు
కృష్ణ: మనసులో.. ముకుందతో పెళ్లి అంటే మీరు ఏమైపోతారు సార్. మీరు నన్ను ఇష్టపడుతున్నారు అని తెలుసు. అభిమానిస్తున్నారు అని తెలుసు. ప్రేమిస్తున్నారు అని నాకు తెలుసు. ఈ విషయం నాకు తెలిసేలా మీరు నిత్యం ప్రయత్నిస్తున్నారు అని కూడా నాకు తెలుసు. ఇవన్నీ తెలిసి మీ ముందు మట్టి బొమ్మాలా నిల్చొన్న నేను ఇప్పుడు చేయాల్సింది ఈ పెళ్లి ఆపడం. ఇక ఇద్దరం టిఫెన్ తిందాం అని కృష్ణ మురారిని పిలుస్తుంది. ఇక ఇద్దరూ ఆరుబయట కూర్చొంటే మురారి కృష్ణకు టిఫిన్ తినిపిస్తాడు. కృష్ణ ఎమోషనల్ అవుతుంది. కృష్ణ కూడా మురారికి తినిపిస్తుంది.
మరోవైపు నందూ తన గదిలో ఏడుస్తుంది. ఇక అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చి ఇంటి నుంచి వెళ్లి పోదానమని అంటాడు. దీంతో నందూ నువ్వు స్వార్థపరుడివి అంటుంది. మనకు ఇంత చేసిన కృష్ణ బాధ పడుతుంటే మనం వెళ్లి పోదాం అని ఎలా అంటావ్ అని అంటుంది. ఇక గౌతమ్ సారీ చెప్పి ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి అని నిర్ణయించుకుంటారు.
ఇక తన కళ్లముందే తన బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే తాను ఏం చేయలేకపోతున్నా అని రేవతి బాధ పడుతుంది. కృష్ణ ఏ నేరం చేయలేదు అని రుజువు అయిన తర్వాతే ఈ పెళ్లి చేయాలని చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది.
ముకుంద: నన్ను చూస్తే చంపేయాలి అన్నంత కోపంగా ఉంది కదా అత్తయ్య. ఉంటుంది అత్తయ్య కానీ ఏం చేయలేని పరిస్థితి. మిమల్ని చూస్తేంటే నాకే కాదు ఎవరికైనా జాలిగానే ఉంటుంది.
రేవతి: ఆపుతావా చేసింది అంతా చేసి ఇప్పుడు ఈ నంగనాచి మాటలు మాట్లాడుతున్నావా.
ముకుంద: నేనేం చేశాను అత్తయ్య మీ అబ్బాయిని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించడం తప్పా. చెప్పండి
రేవతి: పెళ్లయిని వాడితో
ముకుంద: అత్తయ్య.. ఎందుకు అత్తయ్య నా చేత పదే పదే నా ప్రేమ కథని చెప్పిస్తారు. చెప్పండి. మురారి పెళ్లి ఒక పెళ్లా .. నా పెళ్లి ఒక పెళ్లా రెండు పెళ్లిలు మైనస్ అత్తయ్య. మీ కొడుకు అదృష్టవంతుడు చావు వరకు వెళ్లి మరో జన్మ ఎత్తాడు. ఆ జన్మలో కృష్ణ మురారి భార్య ఈ జన్మలో మురారినే నా మొగుడు. మళ్లీ కృష్ణతో మురారి ఉండడం ఈ జన్మలో జరగదు గుర్తుపెట్టుకోండి
రేవతి: జరుగుతుంది జరిగితీరుతుంది.
ముకుంద: ఎలా మీరు అంటే సరిపోదు. దానికి తగ్గ ఆధారం చూపించండి. ఆ పెద్ద పల్లి ప్రభాకర్.. మురారి మీద మర్డర్ ప్రయత్నం చేసి జైలుకి వెళ్లాడు. ఇక నైనా మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు వినండి.
రేవతి: మా అక్కయ్య ఏం పిచ్చిది కాదు. నువ్వే మా అక్కయ్యను సలహాలు చెప్పి పిచ్చి మాటలు చెప్పి నమ్మంచావు.
ముకుంద: అంటే ఒకరి చెప్తే వింటుందా మా అత్తయ్య. తనేంటో నాతోపాటు ఈ సిటీలో అందరికీ తెలుసు. అందుకే సిద్ధంగా ఉండాలి. పెళ్లి పనులు ప్రారంభించండి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.