ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా చంద్రబాబును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. రెండ్రోజుల కిందట అసెంబ్లీలో చంద్రబాబు భార్య పట్ల వైఎస్ఆర్ సీపీ నేతలు పరుష పదజాలాన్ని ఉపయోగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు.


తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలను తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని రజనీకాంత్‌ వెల్లడించారు. ఈ మేరకు చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత డాక్టర్ మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో తనకు పరిచయాలు ఉన్నాయని, ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని తాను బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ మైత్రేయన్ ప్రముఖ ఆంకాలజిస్టు. బసవతారకం కాన్సర్ ఆస్పత్రి ప్రారంభించిన నాటి నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.






Also Read: ప్రాణాలు కాపాడేందుకు వచ్చి.. విగత జీవిగా మారిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ 


Also Read: భారీ వర్షాలకు పోటెత్తిన పాపాగ్ని నది... కుంగిపోయిన కడప-కమలాపురం వంతెన


Also Read: నాలుగు జిల్లాలపై వరద ప్రభావం... పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు... 24 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి