YCP MLC Israel Hot Comments : వైసీపీ ఎమ్మెల్సీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.. గతంలో ఓ ఉత్సవంలో స్టేజిపై అమ్మాయిలతో డ్యాన్స్ చేసిన పాత వీడియోలు వైరల్ అవ్వడంతో ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ పేరు మార్మోగింది. అవి ఎమ్మెల్సీ అవ్వకముందు వీడియోలు అని తేలడంతో అంతా లైట్ తీసుకున్నారు. సామాన్య వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన ఇజ్రాయేల్‌ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎమ్మార్పీఎస్ నాయకునిగా ఉద్యమంలో పాల్గొని ఆపై వైసీపీలో కూడా చురుగ్గా పనిచేస్తుండడంతో కుల సమీకరణాల్లో భాగంగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది.. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
మూడు రోజులు క్రితం ఆయన బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పడు దుమారాన్ని రేపుతున్నాయి.. అదికూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు కావడంతో జనసేన పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. దీనిపై నేరుగా జనసేన నాయకుడు, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఏకంగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి మనకి లేదు అంటూ సున్నితంగా హితవు పలికారు..
ఇంతకీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఏమన్నారంటే...
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రం అంతటా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలపై బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాని వైసీపీ నిర్వహిస్తోంది.. ఇందులో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో గోడి గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే బొమ్మి ఇజ్రాయేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ తన ప్రసంగంలో "పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లుగానే కాదు ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు పాలేరుగా ఉంటానంటున్నాడు. తప్ప పార్టీ పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడని, అయితే ఆయన అన్నగారు కూడా ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. పవన్ కల్యాణ్ కూడా బీజేపీలోకా లేక చంద్రబాబుతో విలీనం అవుతాడో తెలియదు. కానీ పక్కా" అంటూ ఇజ్రాయేల్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..
ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే..
పవన్ కల్యాణ్‌పై వైసీసీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ శ్రేణులు భగ్గు మన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. నేరుగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. దయచేసి నోరు జారవద్దని, పాలేరు తనం ఏంటి..? వాట్‌యూ మీన్.. ఏమనుకున్నావ్ అసలే.. పవన్ కల్యాణ్ సంగతి ఒక్కసారి ఆలోచించాలని, ఆయన్ను ఆవిధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి..? ప్రైమ్ మినిస్టర్ అందరినీ విడిచిపెట్టి ఆయన్ను పిలుస్తాడు. ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెబితే ఇస్తున్నారని, ఒక్కసారి ఆలోచించు.. తప్పు ఎప్పడూ అలా మాట్లాడవద్దని సున్నితంగానే హితవు పలికారు. ఈ వీడియో కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే స్థానిక జనసేన నాయకులు సూదా చిన్నా, నాగ మానస, రొక్కాల నాగేశ్వరరావు తదితరులు కౌంటర్ ఇచ్చారు.