పిఠాపురానికిరెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వర్మ ఒకసారిస్వంతంత్య్రఅభ్యర్థిగామరోసారిటీడీపీఅభ్యర్ధిగా పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.అలాంటివర్మపై పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ ప్రచారంజరుగుతోంది.ఆయనవైసీపీలోకివెళ్తున్నారనేప్రచారంజోరందుకుంది. కూటమిలోప్రాధాన్యతఇవ్వడంలేదనేఅసంతృప్తితోవర్మఉన్నారనిఅందుకేపక్కచూపులుచూస్తున్నారనిఆప్రచారంసారాంశం.
వర్మటీడీపీకివీరాభిమాని. చంద్రబాబు, లోకేష్ అంటేఎంతోఇష్టం. అలాంటివర్మ పార్టీ మారడం అనేది ఫేక్ ప్రచారంగాచాలామందికొట్టిపారేస్తున్నారు. అయితేపవన్కల్యాణ్ను గెలిపించడంలోవర్మపాత్రలేదనిఎవరూకాదనలేనినిజం. ఆతర్వాతకూటమి ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతఇవ్వడంలేదనేవిమర్శఉంది. ఆయనకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇంతవరకు చర్చకురాలేదు. జనసేన నాయకులు ఆయనపైవిమర్శలుచేయడంవంటి పరిణామాలు జరుగుతున్నప్రచారంనిజమనినమ్మేవాళ్లులేకపోలేదు.
వర్మపై జరుగుతోన్న ప్రచారం ఏంటి..?
మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీనియోజకవర్గఇంచార్జ్వర్మవైసీపీలోచేరుతున్నారన్నఆరోపణలుగందరగోళానికితెరలేపాయి. నిజంగానే వర్మటీడీపీనువదిలివైసీపీలో చేరుతున్నారా.. అనే చర్చ కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు మొత్తం కాకినాడ జిల్లాలోసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లోవర్మనుకూటమిప్రభుత్వంఉపయోగించుకునికరివేపాకులాతీసేస్తుందని, ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వలేదని, జనసేన ఆవిర్భావ సభలోపవన్కల్యాణ్సోదరుడునాగబాబువ్యాఖ్యలు ఇలా వర్మను పూర్తిగా అసంతృప్తిలోకి నెట్టాయనిఅంటున్నారు. ఈకారణంతోనేఆయనటీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోచేరుతున్నారనిసోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
తప్పుడు ప్రచారమంటూపోలీసులకు ఫిర్యాదు
వర్మపైకావాలనేకొందరుతప్పుడుప్రచారంచేస్తున్నారనిపిఠాపురం టీడీపీనాయకులుఆరోపిస్తున్నారు. కావాలనిఆయన్నిరాజకీయంగాదెబ్బతీసేందుకుఇలాంటిఇలాంటిదుష్ప్రచారంచేస్తున్నారనిఅంటున్నారు. విమర్శలతోఆగకుండాపిఠాపురంపట్టణపోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో భారీగా తరలివచ్చినవర్మ అభిమానులు, అనుచరులుసోషల్ మీడియా, యూట్యూబ్‌లోతప్పుడుప్రచారం చేసిన వ్యక్తులపైలిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు.
వర్మ టిడిపికి రాజీనామా చేస్తున్నారని, వైసీపీలోకి చేరుతున్నారని వంటి కల్పిత వార్తలను ప్రచారం చేసి, ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేలా తప్పుడు వార్తలను ఇటీవల ప్రచారం చేశారు. పిఠాపురం టిడిపి నాయకులు ఈ తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో ఆధారం లేని వార్తలను ప్రచారం చేసి, వర్మ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
