West Godavari News: తూర్పు గోదావరి జిల్లా గోకవరం సంతలో పండుగ వాతావరణం నెలకొంది. గోకవరం కోళ్ల సంతలో భారీగా వచ్చిన వివిధ రకాల జాతుల పందెం కోళ్లను అమ్మేందుతు వందల సంఖ్యలో జనం తరలివచ్చారు. అలాగే కోళ్లను కొనేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలి వస్తున్నారు. నర్సీపట్నం, భీమవరం, పాడేరు, బొబ్బిలి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా వ్యాపారస్తులు కోళ్లను తీసుకువచ్చారు. కోళ్లను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది సంతకు చేరుకున్నారు. సంతలో ఉన్న వివిధ రకాల జాతుల కోళ్లు జంతు ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క కోడి ధర 7 వేలు నుంచి 20 వేలు వరకు కూడా పలుకుతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం సంతలో ఎక్కువ సంఖ్యలో పందెం కోళ్లు చేరుకున్నాయి. 




మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ మొదలు కాబోతున్నందున ఈ కోళ్ల అమ్మకాలు భారీగా సాగుతున్నాయి. అప్పుడు ఏపీలో ఎక్కువగా కోళ్ల పందాలు జరుపుతారు. అందుకే ఈ కోళ్ల కొనుగోళ్లు బాగా సాగుతున్నాయి. పెద్ద పండుగ వేళ పందేనికి సై అంటూ యథేచ్చగా బరులు మెదలు పెడుతుంటారు. దానికి తోడు గుండాట, పేకాట, సహా అనేక జూద క్రీడలు కూడా ఆడుతుంటారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరుగా కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. కోడి పందాలకు భీమవరం మరింత ఫేమస్. 



గోక