తుపాను, భారీ వర్షాలపై ఉదయం 11:30గంటలకు సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. బంగాళాకాతంలో ఏర్పడిన తుపాను అల్పపీడనంగా మారింది. మార్నింగ్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం బంగాళాకాతంలో నుంచి తేమ ఏపీ వైపు విస్తరించింది ఉంది. ఈరోజు అర్థ రాత్రి, రేపు కూడా దివిసీమ భాగాల్లో మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదవుతాయి. 13 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. 14,15న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే 18,19,20,21 తేదీల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ
మాండౌస్ తుపాను సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని రిక్వస్ట్ చేశారు రామకృష్ణ. పంట చేతికొచ్చిన తరుణంలో తుపాను వల్ల వేల ఎకరాల పంట నీటిపాలై రైతులు కుదిలైపోయారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో కల్లాల్లోని ధాన్యం నీట మునిగిందని వివరించారు. అధికార యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని మీరు చెప్పినప్పటికీ, కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉండటం విచారకరమన్నారు. తమ పార్టీ పార్లమెంటరీ నాయకులు, ఎంపీ బినాయ్ విశ్వం కడప కలెక్టరేట్ సందర్శించినప్పుడు అధికారులు ఎవరూ లేరన్నారు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించి ఆదుకోండి.
పెట్టుబడులపై సమీక్ష
ఏపీలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఇవాళ జరగనుంది. కొత్తగా రాష్ట్రంలో పలు పెట్టుబడులకు ఆమోదం SIPB తెలపనుంది. 12 గంటలకు పరిశ్రమల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖలో జరగనున్న ఇండస్ట్రీయల్ సమ్మిట్, పరిశ్రమల స్థాపనపై చర్చించనున్నారు.
బడ్జెట్‌పై ఫోకస్
వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది. ఇవాళ్టి నుంచి శాఖలవారీగా ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చులు, వచ్చే ఏడాది కేటాయింపులపై చర్చిస్తారు. ఐదు రోజులపాటు అన్ని శాఖల అధికారులతో ఆర్థిక శాఖ సమావేశం కానుంది.
తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్న భక్తులకు దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం ప్రకారం 4 నుంతి 5 గంటల సమయం పడుతుంది. నిన్నటి రోజున 72వేల 466 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా 28,123 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజు హుండీ ద్వారా శ్రీవారి భక్తులు 4.29 కోట్ల రూపాయలు కానుకలు సమర్పించారు.