Tiger Footprint at Rowthulapudi Mandal: కాకినాడ జిల్లా జిల్లాలో తిష్టవేసిన రాయల్ బెంగాల్ టైగర్ ఆనవాళ్లు మళ్లీ కనిపించాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పులి పాదముద్రల కోసం అన్వేషిస్తున్న అటవీ శాఖ అధికారులకు పెద్ద పులి ఆనవాళ్లు కాకినాడ జిల్లా పరిధిలోని రౌతులపూడి మండలం లచ్చిరెడ్డి పాలెంలో కనిపించాయి. రెండు రోజుల నుంచి వర్షం కారణంతో అధికారులకు పులి పాద ముద్రలు లభించలేదు. ఈ క్రమంలో తాజాగా రౌతులపూడి మండలం లోని ఎస్. పైడి పాల గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చిరెడ్డి పాలెంలో పులి పాద ముద్రలు కనిపించడంతో అధికారులతో పాటు ప్రజలు మళ్లీ అప్రమత్తమయ్యారు. అయితే ఎన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేసి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా పెద్దపులి అంచనాలకు అందడం లేదు. బోనులో చిక్కుకోవడం. బోను వరకు వచ్చి వెళ్లిపోయినట్లు కొన్ని చోట్ల పాదముద్రల్ని చూసి అధికారులు నిర్థారించారు.


అవి పెద్దపులి పాదముద్రలే.. 
గ్రామ శివారు ప్రాంతమైన అరటి తోటల్లో పులి అడుగు జాడలు స్థానికులకు కనిపించాయి. స్థానిక రైతుల సమాచారంతో హుటాహుటీన వెళ్లిఅటవీశాఖ అధికారులు ఆ చోటును పరిశీలించారు.  అక్కడ కనిపించినవి పెద్దపులి పాద ముద్రలు అని అధికారులు నిర్ధారించారు. పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని స్థానిక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పులి పాద ముద్రలు లభ్యం అయిన లచ్చిరెడ్డి పాలెంలో ట్రాక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. దాని ద్వారా పులి జాడను త్వరగా కనిపెట్టి పట్టుకుని అడవికి తరలించాలని భావిస్తున్నారు. 


అదే మార్గంలో వెనక్కి వెళ్లే యత్నాలు..
అటవీ ప్రాంతం నుంచి గ్రామాలలోకి వచ్చిన బెంగాల్ టైగర్ తిరిగి అదే మార్గంలో అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి అత్యంత సమీపంలో పెద్ద పులి కదలికలు ఉన్నట్లు గుర్తించారు. పులి పాదముద్రలు గుర్తించిన చోటు నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యదేవుని ఆలయం ఉంది. కానీ పెద్దపులి అటువైపుగా వెళ్లే అవకాశం లేదని అటవీ అధికారులు చెప్పడంతో అన్నవరం వెళ్లే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.  


పాదముద్రలు చూసేందుకు ఎగబడ్డ స్థానికులు..
రెండు రోజులుగా కనిపించని పులి జాడ లభ్యం కావడం.. పాదముద్రలు కనిపించాయన్న విషయం తెలియగానే రౌతులపుడి మండలంలోని పలు గ్రామాల ప్రజలు అడవి వైపు వెళ్తున్నారు. పులి పాదముద్రలు చూసేందుకు, వాటిని ఫొటోలు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి వెళ్లారు. పులి ఏ క్షణంలోనైనా దాడి చేసే ఛాన్స్ ఉందని, అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా లచ్చిరెడ్డి పాలెం వెళ్లి పులి పాదముద్రలు చూసి తిరిగి వెళ్తున్నారు.


Also Read: Kakinada Tiger Fear : సీసీ కెమెరాలకు చిక్కదు, అధికారులకు దొరకదు-ఎత్తుకు పై ఎత్తు


Also Read: Rumors on Kakinada Tiger : అదిగో పులి..ఇదిగో తోక...అక్కడంతా ఇదే..!