East Godavari News : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్లు మృతి చెందారు. మృతులు నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరిగా గుర్తించారు. గోదావరి విహారానికి వచ్చి ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వారిని స్థానికులు రక్షించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

అసలేం జరిగింది?  

ఆదివారం కావడంతో నిడదవోలు మండలం పురుషోత్తమపల్లికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరి విహారానికి గోదావరి దగ్గరకు వచ్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో గోదావరి వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కచెల్లెళ్లు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Also Read : Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!

కర్నాటకలో ఘోర ప్రమాదం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ ట్రక్కు కాలువలోకి దూసుకెళ్లినంది. కూలీలలో వెళ్తున్న ట్రక్కుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు సమచారం మేరకు గోకాక్‌ తాలూకలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు బెలగావికి ట్రక్కులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెలగావిలోని కనబరగి గ్రామం వద్ద ట్రక్కు అదుపుతప్పి బళ్లారి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెలగావి పోలీస్‌ కమిషనర్‌ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు కర్నాటక పోలీసులు ప్రకటించారు. 

Also Read : Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు