Polavaram Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, సామాజిక ముఖ చిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉన్న బహుళార్థసాధక పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రస్తుతం నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఎనిమిది దశాబ్దాల క్రితం మద్రాసు ప్రెసిడెన్సీ కాలంలో బీజం పడిన ఈ ప్రాజెక్టు, నేడు అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో సాకారమవుతుంది. గరిష్టంగా  194. 6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 45. 72 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ చేరుకోవడమే లక్ష్యంగా పనులు వేగంగా సాగుతున్నాయి. 

Continues below advertisement

ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు జరిపిన భేటీ ప్రాజెక్టు భవిష్యత్‌కు కొత్త ఊపిరి పోసింది. పోలవరం పనుల కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 3300 కోట్ల నిధులు మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన 2300 కోట్లకు ఇది అదనం. ఈ నిధులను ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ పనులు, పునరావాసం కార్యక్రమాల కోసం వెచ్చించనున్నారు. 

Also Read: పనితీరే ప్రచారం - విద్యాశాఖలో నారా లోకేష్ సరికొత్త సైలెంట్ విప్లవం!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అక్టోబర్ 2026 నాటికి సాగునీటి పంపిణీ లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. తాజా అధికారిక అంచనాల ప్రకారం,జూన్ 2027 నాటికి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

Continues below advertisement

పోలవరం ప్రాజెక్టు ఆలోచన, 1941లో రామపాద సాగర్ పేరుతో ప్రారంభమైంది. అయితే అధిక వ్యయం, రాష్ట్రాల మధ్య అంగీకారం లేకపోవడంతో దశాబ్దాల పాటు కాగితాలకే పరిమితమైంది. 1980లో గోదావరి జలాలల వివాదాల ట్రైబ్యునల్ తుది తీర్పు తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య ముంపు అంశంపై ఒప్పందం కుదిరింది. 

2004లో ప్రాజెక్టు పనులు లాంఛనంగా ప్రారంభంకాగా, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకర చట్టం ప్రకారం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. దీని ప్రకారం ప్రాజెక్టు సాగునీటి విభాగానికి అయ్యే మొత్తం వ్యయం కేంద్రం భరిస్తుంది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం ప్రాజెక్టు సివిల్ పనుల్లో దాదాపు 76,79 శాతం పురోగతి సాధించాయి. 

Also Read: ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన

గోదావరి గర్భంలో డయాఫ్రమ్ వాల్ 

గోదావరి నది గర్భంలో 60 నుంచి 90 మీటర్ల లోతు వరకు ఉన్న ఇసుక పొరల మీద డ్యామ్ నిర్మించం ఇంజనీరింగ్ పరంగా ఒక అతి పెద్ద సవాల్. ఈ సవాల్‌ను అధిగమించేందుకు ప్రపంచ స్థాయి అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. నది పునాది కింద నీటి ూటను కంట్రోల్ చేసేందుకు 1.5 మీటర్ల మందతో ప్లాస్టిక్ కాంక్రీట్ గోడను నిర్మిస్తున్నారు. గతంలో నిర్మించిన గోడ వరదల వల్ల దెబ్బతినడంతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2025 జనవరిలో ప్రారంభించి పూర్తి చేశారు. 

Also Read:ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్.

కాపర్ డ్యామ్‌ల కింద నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ సాంకేతికతను వాడారు. సిమెంట్ మిశ్రమాన్ని అధిక పీడనంతో ఇసుక పొరల్లోకి పంపి, పునాదిని పటిష్టం చేసే ఈ ప్రక్రియ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి సహాయపడుతుంది. 1.128 కిలోమీటర్ల పొడవునా, 48 భారీ రేడియల్ గేట్లతో స్పిల్‌వే నిర్మించారు. ఇది సెకనుకు 50 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకోగలదు. 

పునరావాసం పెద్ద సవాల్

పోలవరం ప్రాజెక్టు వల్ల 1.06 లక్షల కుటుంబాలు ముంపు బారిన పడుతున్నాయి. దాదాపు 392 గ్రామాలను నివాసాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం 41.15 మీటర్ల కాంటూర్ వరకు ఉన్న బాధితులను మొదటి దశలో తరలిస్తోంది. అయితే నిర్వాసితులు తమకు చెల్లించే పరిహారం సరిపోవడం లేదని పునరావాస కాలనీల్లో కనీస వసతులు కల్పించాలనే అంటున్నారు. పునరావాసం భూసేకరణ కోసమే దాదాపు 33 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రెండో దశలో సుమారు 80 వేల ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది. 

పోలవరం ప్రాజెక్టు కేవలం సాగునీటి డ్యామ్ మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. దాదాపు 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతోంది. అలాగే గోదావరి డెల్టాలోని పది లక్ష ఎకరాల పంటకు మేలు జరగనుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 12 టర్బైన్ల ద్వారా స్వచ్ఛమైన శక్తిని అందుబాటులోకి వస్తుంది. సుమారు 28. 5 లక్షల జనాభాకు తాగు నీరు లభించనుంది. విశాఖ నగరం, అక్కడి పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రత్యేక కాలువ, పైప్‌లైన్ పనులు సాగుతున్నాయి. కృష్ణానది బేసిన్‌కు 80 టీంసీల గోదావరి జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ, కృష్ణా డెల్టా ప్రయోజనం పొందుతాయి. 

కాగ్ లెక్కల ప్రకారం కాలయాపన, డిజైన్ల మార్పుల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై చూపుతున్న చొరవ ప్రాజెక్టు పూర్తిపై ఆశలు పెంచుతోంది.