దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో తూర్పుపశ్చిమ ద్రోణి ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  ఒడిశా ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళ ప్రభుత్వం కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా మందస, టెక్కలి ప్రాంతాల్లో 18 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.  తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిశాయి. విజయవాడలో ఏకధాటిగాకురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. తిరుపతిలోనూ కుండపోత వర్షం పడింది. మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.


బంగాళాఖాతంలో రెండురోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి తెలంగాణపై నుంచి వెళ్తూ హైదరాబాద్‌ తోపాటు పలుచోట్ల కుంభవృష్టి కురిపించింది. ఇవాళ ఆదిలాబాద్‌, కుమురంభీంతోపాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారానికి అల్పపీడనం తెలంగాణ దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిపోతుంది. భారీ వర్షంతో పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న తదితర అనేక పంటలు ఇప్పుడు పూత, కాత, కోత దశలో ఉన్నాయి. ఈ దశలో కొద్దిగంటల్లో భారీ వర్షం పడటం వల్ల పంటలకు నష్టం ఎక్కువగా ఉంటుందని రైతులతో పాటు వ్యవసాయాధికారులు సైతం తెలిపారు.  


ఒడిశాలోని గజపతి, గంజాం, రాయగడ్, కోరాపుట్ మరియు మల్కాన్ గిరి జిల్లాల్లో నేడు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. అక్టోబర్ 19 వరకు ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి.


Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి