Perni Nani On pawan : పవన్ కల్యాణ్ బీజేపీతో తెగదెంపులు చేసేశారని తేలిపోయిందని వైఎస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది అంటే చంద్రబాబుతో కలిసి వెళ్లడమేనని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో లగ్నం చేసుకోవడానికి ముహుర్తం దగ్గర పడిందన్నారు. ఈ ముసుకు వెనుక చంద్రబాబుకు గులాంగిరీ ఉందన్నారు. తాము సోదరా అంటేనే అంత కోపం వచ్చిందని.. తమను ..నా కొడకల్లాలా అని పవన్ కల్యాణ్ అన్నారని విమర్శించారు. పవన్ ఏంటీ నీై బలుపు అని పేర్ని నాని ప్రశ్నించారు. మొత్తం 175 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనడం మానేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీలో గూండాలు లేరని పవన్ వెనుకే ఉన్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు.
175 స్థానాల్లో పోటీ చేయాలని పవన్‌కు పేర్ని నాని సవాల్
నిజంగా దమ్ముండి.. ప్యాకేజ్ స్టార్ వి కాకపోతే.. సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయాలి అని పేర్ని నాని సవాల్ విసిరారు. మరో పార్టీకి ఓటు వేయాలని అని పిలిచే వారిని ప్యాకేజీ స్టారే అంటారు అని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు మమల్ని కొడకుల్లారా అనేంత బలుపు ఉందా అంటూ ఫైర్ అయ్యారు. కాపులంతా మెజార్టీ సంఖ్యలో వైసీపీ వైపు ఉన్నారనే ఇలా పవన్ కడుపు మండిపోతోంది అన్నారు. నిజంగా 175 సీట్లలో పోటీ చేసి.. చంద్రబాబుకి దూరంగా ఉంటే.. అప్పుడు ప్యాకేజీ స్టార్ అని పిలవమంని.. వైసీపీ కాపు నేతలందరి తరపున తాను క్షమాపణ చెబుతానన్నారు పేర్ని నాని.
చంద్రబాబుతో కలిసేందుకే పవన్ తహతహలాడుతున్నారన్న పేర్ని నాని
చంద్రబాబుతో చెట్టపట్టాలు వేసుకునేందుకు లగ్నం దగ్గర పడిందని.. సోదరా అంటే మీకు కడుపు మండితే.. మమ్మల్ని కొడకల్లారా అంటే కడుపు మండదా.. సన్నాసిన్నర సన్నాసి అంటూ ఫైర్ అయ్యారు. నాకు కులమే లేదని చెప్పిన శుంఠవి నీవే కదా అని ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబంపై దాడి చేసినప్పుడు ఎక్కడున్నావని ప్రశ్నించారు. దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ, వెంకయ్య సహా బీజేపీ నేతల్ని బూతులు తిట్టి, నాలుక తడి ఆరకుండానే ఆ పార్టీతో అంటకాగలేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని.. 25 మంది మంత్రుల్లో ఐదుగురు మంత్రులు కాపులేనని పేర్ని నాని తెలిపారు.
కాపులు వైసీపీతోనే ఉన్నారన్న మాజీ మంత్రి
కాపులు వైసీపీతోనే వున్నారని.. ఇకపైనా వుంటారని పేర్ని నాని స్పష్టం చేశారు. తనకు కులమే లేదని చెప్పింది నురు. మాకూ తిట్లు వచ్చని.. మేం తిట్టలేమా అంటూ పేర్నినాని మండిపడ్డారు. సీఎం జగన్‌ను నీ పార్ట్‌నర్ ఆఫీస్ నుంచి తిట్టించినప్పుడు నీకు నోరు పడిపోయిందా అంటూ నాని ప్రశ్నించారు. పవన్ తన ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను చంద్రబాబుకు అప్పగించేలా పనిచేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి వుంటున్నానని.. కానీ వారితో కలిసి ఉద్యమం చేయలేకపోతున్నానని పవన్ అన్నారని.. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా పవన్ కల్యాణ్ మాట్లాడారని పేర్నినాని ఎద్దేవా చేశారు.