2023 ప్రారంభంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. అర్హులయిన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందించేందుకు పదే పదే ప్రయత్నాలు చేస్తుంటామని చెబుతున్న సీఎం జగన్ అదే సమయంలో అనర్హులకు పథకాలను కట్ చేయటంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి పెన్షన్ తీసుకుంటున్న వారిని వెతికి మరి కోతలు పెడుతోంది ఏపీ సర్కార్.


ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సర వేళ పెన్షన్ల చుట్టూ రాజకీయం మెదలైంది. సీఎం జగన్ ముందుగా చెప్పిన విదంగా అర్హులయిన వారికి పథకాలను అందిస్తామని, అదే సమయంలో అనర్హులను తోలగించేందుకు కూడా వెనకాడమని అంటున్నారు. దీంతో నూతన సంవత్సర వేళ పెన్షన్ తొలగింపు అప్పుడే మెదలైంది. ఒక వైపున పెన్షన్ల పంపిణీ జరుగుతుంటే ఇంకోవైపున పెన్షన్ రాని వారు తెల్లముఖాలు వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ వ్యవహరం పై రాజకీయం మెదలు పెట్టారు. ఒక్కో వాలంటీర్ పరిధిలో పదుల సంఖ్యలో పెన్షన్ లు కోతపడ్తాయని అంటున్నారు, అదే సమయంలో కొత్త వారికి పెన్షన్ లను అందిస్తున్నారు.


ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక – ఇకపై ప్రతి నెలా రూ. 2,750 
జనవరి 1, 2023 నుంచి పెంచిన పెన్షన్లు పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వారోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ( 03.01.2023, మంగళవారం) జరగనున్న కార్యక్రమంలో పాల్గొని, పెంచిన పెన్షన్లను సింబాలిక్‌గా లబ్ధిదారులకు అందజేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.


దీంతోపాటు కొత్తగా అర్హులైన వారికి (జులై 2022 నుంచి నవంబర్‌ 2022 వరకు) పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ళపట్టాల పంపిణీ చేయనున్నారు.


పెన్షన్‌ కార్డులు ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య (1.12.2022 నాటికి) 62,31,365 నేడు పంపిణీ చేస్తున్న కార్డుల సంఖ్య 2,31,989 - మొత్తం కార్డుల సంఖ్య (1.1.2023 నాటికి) 64,06,240


బియ్యం కార్డులు ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య (1.12.2022 నాటికి) 1,45,43,996 నేడు పంపిణీ చేస్తున్న కార్డుల సంఖ్య 44,543 - మొత్తం కార్డుల సంఖ్య (1.1.2023 నాటికి) 1,45,88,539


ఆరోగ్యశ్రీ కార్డులు ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య (1.12.2022 నాటికి) 1,41,34,208 నేడు పంపిణీ చేస్తున్న కార్డుల సంఖ్య 14,401 - మొత్తం కార్డుల సంఖ్య (1.1.2023 నాటికి) 1,41,48,249


ఇళ్ళ పట్టాలు ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్య (1.12.2022 నాటికి) 30,14,640 నేడు పంపిణీ చేస్తున్న కార్డుల సంఖ్య 14,531 మొత్తం కార్డుల సంఖ్య (1.1.2023 నాటికి) 30,29,171


01.01.2023 నుంచి 64.06 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ. 21,180 కోట్లు,  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెన్షన్లపై చేసిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ. 62,500 కోట్ల పైమాటే...


నెలకు పెన్షన్‌ 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో జూన్‌ 2019న చెప్పిన మాట మేరకు పెంచిన పెన్షన్‌ రూ. 2,250, జనవరి 2022 నుంచి రూ. 2,500, జనవరి 2023 నుంచి రూ. 2,750


పెన్షన్ల పై  నెలవారీ సగటు వ్యయం రూ. కోట్లలో 


గత ప్రభుత్వంలో 2014 – 19 రూ. 400 కోట్లు పెన్షన్‌


 వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో జూన్‌ 2019 దాదాపు మూడున్నర రెట్లు పెంపు రూ. 1,350 కోట్లు, జనవరి 2022 నుంచి దాదాపు నాలుగు రెట్లు పెంపు రూ. 1,570 కోట్లు, జనవరి 2023 దాదాపు నాలుగున్నర రెట్లు పెంపు రూ. 1,765 కోట్లు


పెన్షన్‌ లబ్ధిదారులు (లక్షల్లో)...


గత ప్రభుత్వంలో 2014 – 19లో 39 లక్షల లబ్దిదారులు కాగా,  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 2019 అర్హులైన అందరికీ 52.17 లక్షలు, 2022 లో అర్హులైన అందరికీ 100 శాతం అంటే 62.31 లక్షలు, 2023 అర్హులైన అందరికీ అంటే 64.06 లక్షల మందిని లబ్దిదారులుగా గుర్తించి పింఛన్లు అందిస్తున్నారు.