జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి సినిమా ఆచార్య  ( Acharya ) ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ నెల 23వ ఆచార్య చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతథిగా పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. నిజానికి ఈ వేడుకను విజయవాడ సిద్ధార్థ మైదానంలో నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. సీఎం జగన్ ను ముఖ్య అతిధిగా పిలవాలని అనుకున్నారు. దాదాపుగా నిర్ణయాలు అయిపోయాయి. జగన్  కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది.  కారణం ఏమిటో కానీ చివరి నిమిషంలో ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. 


'భలే భలే బంజారా' సాంగ్ - సిరుత పులులు కలిసి సిందేస్తే


దీంతో సహజంగానే జగన్‌కు బదులుగా వెరొకర్ని ముఖ్య అతిధిగా ఖరారు చేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్  ( Pavan Kalyan )  అయితే బాగుంటుందని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. దీంతో చిరంజీవి, పవన్ ఒకే వేదిక పై సందడి చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సామాజిక అంశాలపై రూపొందినది కావడంతో ప్రి రిలీజ్ వేడుకలో ఈ అంశాలపై ప్రస్తావిస్తే రాజకీయం అయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ములిద్దరూ ఒకే వాయిస్ వినిపిస్తే ..  ఏపీ రాజకీయాలలో కలకలం ప్రారంభమవుతుంది. అయితే తాను రాజకీయాలకు దూరమని చిరంజీవి చెబుతున్నారు కాబట్టి... పవన్ కల్యాణ్‌ను కూడా వేదికపై రాజకీయాలు మాట్లాడే అవకాశం లేదని భావిస్తున్నారు.  


రీషూట్స్ చేస్తే తప్పేంటి? కొరటాల శివ రియాక్షన్


సాయి ధర్మతేజ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు జరిగిన రిపబ్లిక్ ( Republic ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. నిజానికి పవన్ కల్యాణ్ సినిమా రంగ సమస్యలపైనే మాట్లాడారు. అయితే అవి ఏపీ ప్రభుత్వంతో సంబంధం ఉన్న సమస్యలు కావడంతో పవన్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రెండుగా విడిపోయింది. ఆ తర్వాత అనేక చర్చోపచర్చల తర్వాత కొన్ని సమస్యలకు పరిష్కారం లభించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆచార్య ప్రి రిలీజ్ వేడుక మీద రాజకీయ విమర్శలు చేసే అవకాశం లేదని భావిస్తున్నారు.  ప్రీ రిలీజ్ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అభిమానులకు పాస్‌లు పంపించారు.