Bengaluru News: భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత బలంగా ఉంటే వారి బంధం అంత గట్టిగా ఉంటుంది. అనుమానం పెను భూతమైతే మాత్రం విషాదాంతాలు తప్పవు. ఇప్పటికే భాగస్వామిపై అనుమానంతో ఎంతో మంది తమ బంధాన్ని నాశనానం చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో (Bengaluru News) కూడా జరిగింది. అశ్లీల చిత్రాలు, పోర్న్ వీడియోలు చూసేందుకు అలవాటు (Porn Videos Addiction) పడ్డ ఓ ఆటో డ్రైవర్ తన భార్యను నిర్దాక్షిణ్యంగా (Husband Kills Wife) చంపేశాడు. తాను చూస్తున్న ఓ పోర్న్ వీడియోలో మహిళ అచ్చం తన భార్యను పోలి ఉండడంతో ఆమె ఆ నీలి చిత్రంలో నటించిందని అనుకొని భావించిన అతను భార్యను కత్తితో పొడిచి మట్టుబెట్టాడు. 


బెంగళూరు పోలీసులు (Bengaluru Police) వెల్లడించిన వివరాల ప్రకారం.. జహీర్ పాషా అనే 40 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి చాలా రోజుల క్రితమే పోర్న్ వీడియోలు చూడడం బాగా అలవాటు అయింది. ఆ క్రమంలోనే ఓ వీడియోలో తన భార్య మునీబా (35) కూడా నటించిందనుకొని అనుమాన పడ్డాడు. అదే నిజం అనుకొని నమ్మి ఆమెను తరచూ వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. చివరికి తన కన్న పిల్లల ముందే భార్యను ఆదివారం (ఏప్రిల్ 17) కత్తితో పొడిచి చంపాడు. 


వీరిద్దరికీ 15 ఏళ్ల క్రితం వివాహం కాగా, బెంగళూరులోనే (Bengaluru News) నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం భర్త జహీర్ పాషా, తన భార్య మునీబాను దారుణంగా అవమానించాడు. ఒక కుటుంబ ఫంక్షన్‌లో అందరిముందే ఆమెను కొట్టినట్లుగా స్థానిక వార్తా పత్రికలు రాశాయి. అదే సమయంలో బంధువులంతా ఆమెను ఎందుకు కొడుతున్నాడో ఆరా తీశారు. 20 రోజుల క్రితం భార్యను పాషా దారుణంగా హింసించాడు. దీంతో ఆమె కొద్ది రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ కేసు విచారణ జరుపుతున్న ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం హింసించినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మునీబా తండ్రి గౌస్ పాషా ప్రయత్నించగా, అతణ్ని ఆమె నిలువరించిందని తెలిపారు. తాజాగా భర్త మరింత బరి తెగించి భార్యను చంపేశాడని తెలిపారు.


Also Read: Suryapet Crime : క్రూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి, మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం


Also Read: Anankapalli Crime : కాబోయే భర్త గొంతు కోసిన యువతి, కళ్లు మూసుకుంటే సర్ ప్రైజ్ ఇస్తానని దాడి