మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. 


ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. హనుమాన్ జయంతి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో 'భలే భలే బంజారా' అనే సాంగ్ ను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నామని తెలిపారు. కాసేపటి క్రితమే ఈ పూర్తి పాటను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ల స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. 


ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కి జోడీగా పూజా కనిపించనున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తిరుణ్ణావుక్క‌రుసు సినిమాటోగ్రాఫ‌ర్‌. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!


Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత


Also Read: అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వేదాంత్ మాధవన్, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న నటుడు మాధవన్