Pawan Kalyan On AP Liquor Sales: సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని సైతం పవన్ ట్వీట్‌లో జోడించారు. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల  ఆదాయం కూడా వారికే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు..


లిక్కర్ బాండ్లు వేలం వేసి అప్పు తెచ్చుకున్న జగన్ సర్కార్ 
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి బాండ్లను వేలం వేసి రూ. 2 వేల కోట్ల రుణాలను సమీకరించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం లిక్కర్ బాండ్లను జారీ చేసింది.  ఎలాంటి ప్రచారం లేకుండా ప్రభుత్వం ఈ పని పూర్తి చేసింది. 9.5 శాతం వరకు వడ్డీతో రూ. ఎనిమిది వేల కోట్లు బాండ్లు వేలం వేసి అప్పు తెచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. రేటింగ్ సంస్థలు స్టేబుల్ కేటగిరి కింద రేటింగ్ ఇవ్వడంతో రుణ సమీకరణ సులువు అయింది. 






నిషేధం చేసేది లేదని హామీ పత్రాలు..
ఏపీలో దశలవారీగా మద్యం నిషేధిస్తామని గతంలో చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిక్కర్ బాండ్లు మూడు నెలల్లో లిక్విడేట్ అయినట్లుగా భావించి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. వచ్చే ఎన్నికల సమయానికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే లిక్కర్ అమ్ముతామని.. అప్పుడే ఓట్లు అడుగుతామని చెప్పిన ప్రభుత్వం అసలు మద్య నిషేధం చేయబోమని హమీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.


ఇదేనా మద్యపాన నిషేధం.. నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న
ఏపీలో మద్య నిషేధం అంటే మద్యం ఆదాయం పెంచడమే అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం విమర్శించారు. ఇదే వైఎస్ జగన్ చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల టైంలో మద్యం ద్వారా రూ.9 వేల కోట్ల ఆదాయం వస్తే వైసీపీ అధికారంలో వచ్చాక మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని మనోహర్ ఆరోపించారు. ఇదేనా వైసీపీ మద్యపాన నిషేధం అని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 


Also Read: Andhra Liquor bonds : లిక్కర్ బాండ్లతో రూ. 8 వేలకోట్ల అప్పు తెచ్చిన ఏపీ సర్కార్ - మద్యనిషేధం చేయబోమని హమీ పత్రం !


Also Read: Nadendla Manohar On Liquor Bonds : మద్యనిషేధం అంటే మద్యం ఆదాయం పెంచుకోవడమే, జగన్ జాక్ పాట్ కొట్టారు- నాదెండ్ల మనోహర్