Minister Botsa Satyanarayana : రాజధానులపై మూడు ముక్కలాట అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖను రాజధానిగా ఒప్పుకోనివాళ్లకు ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కులేదన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ  విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేసి తీరాలని డిమాండ్‌ చేశారు. విశాఖను రాజధాని చేస్తే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. వీలైనంత త్వరగా విశాఖను రాజధానిగా ప్రకటించాలని సీఎం జగన్ ను కోరుతున్నట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వాల సమయంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చబట్టే ఇంటింటికీ వెళ్లగలుగుతున్నామని బొత్స అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందన్నారు.   


స్పీకర్ ఫైర్ 


చంద్రబాబు ఏపీకి పట్టిన ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని స్పీకర్  తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభలకు ప్రజలు భారీ వస్తుండడంపై స్పందించిన ఆయన... అందరి సభలకు ప్రజలు వస్తున్నారన్నారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదని విమర్శించారు. ఎన్నికలు సమీపించేసరికి చంద్రబాబు మరింత దిగజారుతున్నారన్నారు. చంద్రబాబుకు విలువలు, నైతికత అవసరం లేదని స్పీకర్ ధ్వజమెత్తారు.  


చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు - మంత్రి గుడివాడ అమర్నాథ్ 


  చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో చేస్తున్న విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.   వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత టీడీపీని, చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ప్రతాపం తెలంగాణలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని..  తర్వాత అండమాన్ నికోబార్ లేదా తమిళనాడు వెళ్లిపోతారన్నారు.  ఇలాంటి మనస్తత్వం కలిగిన నాయకులని పిచ్చివాళ్లు అంటారని అమర్నాథ్ విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అందుకే తెలంగాణలో సమావేశం పెట్టారన్నారు. కోవిడ్  వాక్సిన్ టీడీపీ కనిపెట్టింది అనడం దారుణమని అమర్నాథ్ అన్నారు. మోదీని తిట్టి, అమిత్ షాపై రాళ్ళు వేయించిన వ్యక్తి జిమ్మిక్ లన్నీ వాళ్ళకి తెలుసన్నారు.  ఎక్కడికి వెళ్ళినా మైక్ కూడా పట్టుకోలేకపోతున్నారని, ఈ ప్రాకులట దేనికని మంత్రి విమర్శించారు.  రాజాంలో... ఉత్తరాంధ్రకి ఏంచేశారు అని అడిగారని...1995లో  ముఖ్యమంత్రి అయి మీరు ఏమి చేశారని చంద్రబాబును ప్రశ్నించారన్నారు.  2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏంకట్టారని అడగటం సిగ్గుఉందా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే హక్కు   చంద్రబాబుకి లేదన్నారు.  విశాఖ పరిపాలన రాజధాని కి వ్యతిరేకించిన మీకు ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. 


చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు


"ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని అనడంలేదు.  ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా రాజకీయం. చంద్రబాబులాగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని మాట్లాడను. దత్తపుత్రుడి లాగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు. నేను ఏపీలోనే ఉంటాను. ఐదు కోట్ల ప్రజలనే నా కుటుంబం. ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇదే నా రాష్ట్రం, ఇదే నా కుటుంబం. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానం. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనను. ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడంలేదు.  "  - సీఎం జగన్