నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లకు ముందే టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసే వారి పేర్లు ఓటర్ల లిస్ట్‌లో లేవు. దీంతో ఆయా అభ్యర్థులు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఓటర్ల లిస్ట్ లో తమ పేర్లు లేకుండా చేసి, నామినేషన్ల వేళ వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే కార్పొరేషన్ అధికారులు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. ఓటర్ల లిస్ట్ లో తమ పేర్లు చేర్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.
వాస్తవానికి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వాయిదా కోసం టీడీపీ ప్రయత్నాలు చేసింది. డివిజన్ల విభజనలో అధికార పార్టీ తమకు అనుకూలంగా వ్యవహరించిందంటూ కోర్టుకెక్కింది. అయితే కోర్టు ఎన్నికలు జరిపేందుకు అనుకూలంగా తీర్పునివ్వడంతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలకోసం ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలే టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టింది. తీరా నామినేషన్ల వేళ ఓటర్ల లిస్ట్ లో అభ్యర్థుల పేర్లు గల్లంతు కావడంతో గొడవ మొదలైంది.
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు గతవారంలో షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే వారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ వారంలోనే నామినేషన్ దాఖలు చేయాలి. ఇంతలో ఓట్లు గల్లంతు అవ్వడంతో అది కూడా ఏకంగా అభ్యర్థులు అనుకున్న వారికే ఇలాంటి పరిస్థితి రావడం టీడీపీ మండిపడుతోంది. ఇంకా ఎంతమంది ఓట్లు గల్లంతు అయ్యాయో అన్న రీసెర్చ్ మొదలు పెట్టిందా పార్టీ.
ALSO READ: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !
ALSO READ: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి.
ALSO READ: వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
ALSO READ: ఆల్‌టైం గరిష్ఠానికి ఎగబాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో నేటి ధరలివీ..
ALSO READ: విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందా? నిజమేనా?
ALSO READ: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..
ALSO READ: పెట్రోల్ ధరలతో భయమొద్దు.. రూ.100 చెల్లించండి రోజంతా తిరగండి.. సజ్జనార్ ప్రకటన
ALSO READ: డెహ్రాడూన్‌లో అనన్య నాగళ్ల.. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతున్న బ్యూటీ