నెల్లూరులో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. మొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీకి దూరమవుతున్నారనే పుకారు వినపడింది, ఆయన వివరణ ఇచ్చారు. నిన్న మరో ఎమ్మెల్యే మేకపాటి విక్రమె రెడ్డిపై కూడా రూమర్లు వచ్చాయి, ఆయన వాటికి వివరణ ఇచ్చారు. తాజాగా మరో సీనియర్ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పార్టీ మారుతున్నారనే పుకార్లు వినపడుతున్నాయి. దీనిపై పేర్నాటి వర్గం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. తమ నేత పార్టీ మారడంలేదని వైసీపీలోనే ఉంటారంటూ ఆయన అనుచరులు ప్రెస్ నోట్లు విడుదల చేశారు.
ఎవరీ పేర్నాటి..?
నాయుడుపేటకు చెందిన వైసీపీ సీనియర్ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. అన్నీ అనుకున్నట్టు జరిగితే, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచి ఈయన ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. కానీ ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు, గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీనుంచి పోటీ చేసిన శ్యాంప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన కొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనపడటం లేదు. ఓటమి బాధతో ఉన్న ఆయన, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
లోకేష్ తో భేటీ..?
యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కలిశారని వార్తలొస్తున్నాయి. వైసీపీలో ఓటమి చెందిన ఆయన, టీడీపీలోకి వస్తున్నారని, పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని, అందుకే ఆయన లోకేష్ ని కలిశారని అంటున్నారు. దీంతో వెంటనే పేర్నాటి వర్గం అలర్ట్ అయింది. ఈ వార్తలు ఫేక్ అంటూ వివరణ ఇచ్చింది. అయితే వివరణ నేరుగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నుంచి రాలేదు. ఆయన అనుచరుడు రాధాకృష్ణరెడ్డి పేరుతో ఆ వివరణ బయటకు వచ్చింది.
➡️పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ని భ్రష్టు పట్టించేందుకు ఫేక్ న్యూస్ లు పెట్టిస్తున్నారు
➡️ వైసీపీ నీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వీడే ప్రసక్తే లేదు
➡️ టీడీపీలోకి వెళ్ళవలసిన అవసరం పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి లేదు
➡️ జగనన్న వెంటే పేర్నాటి
➡️ కాకాణి,పేర్నాటిల ను భ్రష్టు పట్టించేందుకు టిడిపినేతల కుట్ర
➡️ షోషల్ మీడియా లో వచ్చే ఫేక్ న్యూస్ లు నమ్మద్దు
➡️ షోషల్ మీడియా ఫేక్ న్యూస్ లపై రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు పిర్యాదు చేస్తున్నాం:- రాధాకృష్ణారెడ్డి
➡️ త్వరలోనే అందరి పై కేసులునమోదు చేయిస్తాం
➡️ఎమ్మెల్సీ ఎన్నికలలో కావాలనే ఓడించారనే మనస్థాపం చెంది లోకేష్ ను పేర్నాటి కలిసినట్లు దుష్ప్రచారం చేయడం భావ్యం కాదు
➡️అనంతపురం వెళ్లి రహస్యం గా టీడీపీ యువనాయకుడు లోకేష్ ను కలిసే దౌర్బగ్యం పేర్నాటి కి లేదు
➡️లోకేష్ తో పేర్నాటి మంతనాలు వట్టి బోగస్ ప్రచారం
➡️ త్వరలోనే మీడియా సమావేశంలో అన్నీ వెల్లడిస్తాం
➡️ షోషల్ మీడియా వచ్చే ఫేక్ న్యూస్ లు ఎవ్వరూ నమ్మద్దు
అంటూ వైసీపీ నేత పాదర్తి రాధాకృష్ణ రెడ్డి మీడియాకు తెలియజేశారు. మొత్తమ్మీద రోజుకో నేతపై పుకార్లు రావడం, వారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం, నెల్లూరులో కామన్ గా మారిపోయింది.