YSRCP Leader Kakani Govardhan: వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమమైనింగ్‌కు పాల్పడినట్టు ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరుకాలేదు. దీంతో గోవర్ధన్ అరెస్టుకు సిద్ధం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కాకాణి గోవర్ధన్‌పై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు మూడు సార్లు ఆయనకు నోటీసులు అందచేశారు. అయినా మూడుసార్లు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో పోలీసులు కాకణిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో తనకు రక్షణ కల్పించాలని హైకోర్టును కూడా కాకాణి ఆశ్రయించారు. అయినా అక్కడ రక్షణ దొరకలేదు. కేసులో ముందుకెళ్లొచ్చని కోర్టు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి కాకాణి అజ్ఞాతంలో ఉన్నారు.