Controversy Over Chebrolu Kiran Kumar: సోషల్ మీడియా పుణ్యమా అంటూ నోటికి హద్దూ అదుపూ లేకుండా పెట్రేగి పోతున్న బ్యాచ్‌ని మనం చూస్తున్నాం. పొలిటికల్ సర్కిల్లో అయితే ఇది మరింత విచ్చలవిడిగా తయారైంది. గత ఎన్నికల్లో వైసిపి ఓటమి పాలు అయిందంటే ఇలా సోషల్ మీడియా అబ్యూజ్ కూడా ఒక కారణమే. ఇప్పుడు మేం మాత్రం తక్కువా అంటున్నారు కొంతమంది టిడిపి అభిమానులు. ఇదిగో అలాంటి విపరీత కామెంట్స్‌ తో తీవ్రంగా ట్రోల్ అవుతున్నాడు చేబ్రోలు కిరణ్ కుమార్ అనే టిడిపి అభిమాని.

ఎవరీ కామన్ మ్యాన్ కిరణ్?ఎన్నికల ముందు నుంచి చేబ్రోలు కిరణ్ కుమార్ అనే టిడిపి అభిమాని తెలుగుదేశానికి మద్దతుగా వీడియోలు చేస్తూ వస్తున్నాడు. కామన్ మ్యాన్ కిరణ్ పేరుతో సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య YS భారతిపై రాయడానికి వీలు లేని విధంగా విమర్శలు చేశాడు కిరణ్. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై విమర్శలు చేస్తూ "బట్టలూడదీస్తా" అనే మాటకు కౌంటర్‌గా కిరణ్ ఆయన సతీమణిని టార్గెట్ చేశాడు. దీనితో ఒక్కసారిగా అతనిపై భగ్గుమన్నారు వైసీపీ మద్దతుదారులు. దీనిపై స్పందించిన టీడీపీ NRI విభాగం స్పోక్స్ పర్సన్ చెంచు వేణుగోపాల్ రెడ్డి.. " అతను మా పార్టీ అయితే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మా టీడీపీలో ఇలాంటి క్యారెక్టర్ లెస్ మాటలకు స్థానం ఉండకూడదు అని మా పెద్దాయన చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారు. అదే మేము ఫాలో అవుతున్నాం. ఇతని మాటలు కచ్చితంగా ఎవ్వరూ అంగీకరించరు. ఇలాంటి భాష మాట్లాడుతున్నాడంటే ఇతని మానసిక స్థితి ఏమిటో అర్థమవుతుంది.

నాలుగు బూతులు మాట్లాడి, నలుగురిని తిడితే యూట్యూబ్ వ్యూస్ వస్తాయనుకునే యూట్యూబర్ ఈ కుర్రాడు. యూట్యూబ్ ఛానెల్స్‌కి సెన్సార్ బోర్డు లేకపోవడంతో ఇలాంటి వాళ్లు నోరు జారుతున్నారు.ఈ రోజు నువ్వు అన్నావు, రేపు వాళ్లు ఆనారా? ఏంటి ఇలాంటి మాటల వల్ల ఉపయోగం? కొంచెం నోరు అదుపులో పెట్టుకో. కచ్చితంగా ఇలాంటి మాటల్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు, సమాజానికి ఇలాంటి వాళ్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

ఇది మా పార్టీ ఉద్దేశం కాదు. కచ్చితంగా రెచ్చగొట్టి టైం పాస్ చేయాలనుకునే మూర్ఖుల పని " అని తన "X" ఖాతా లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీలకు ఫిర్యాదు చేశారు. దేనితో చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్టు ఖాయం అంటూ నెటిజెన్స్ స్పందిస్తున్నారు. 

ఒక్కసారిగా తిరుగుబాటు రావడంతో కంగుతున్న కిరణ్ కుమార్ వైఎస్‌ భారతికి క్షమాపణ చెబుతూ మరొక వీడియో రిలీజ్ చేశారు. ఆవేశంలో మాట్లాడిన మాటలను క్షమించాలంటూ ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. 

అది మర్చిపోతే ఎలా?గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అసెంబ్లీ సాక్షిగా దుర్భాషలు ఆడిన సంఘటన ఇంకా ఎవరూ మరవలేదు. అప్పటి ప్రభుత్వ అది కూడా ఒక కారణమే అని చెబుతారు. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాష జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ కొందరు సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటుతున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి పార్టీకి ఎంతైనా ఉంది అని టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.