ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ది పరిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి పర్యాటక అభివృద్ధిపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు అందించారు. ఢిల్లీలో కిషన్ రెడ్డితో శుక్రవారం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. 


ఆత్మకూరు పర్యాటక అభివృద్ధికోసం.. 
ఏపీలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సోమశిలను కేంద్రంగా చేసుకుని పురాతన కట్టడాలు, ప్రాచీన ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమశిల ప్రాజెక్టు, అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యటక ప్రదేశాలుగా మార్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి ఓ రూట్ మ్యాప్ తయారు, చేసి పర్యాటక అభివృద్ధి సాధ్యాసాధ్యాలను మంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలు ఆయన ముందుంచారు.


Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా ఎగబాకిన బంగారం ధర.. ఏకంగా 50 వేలు దాటేసి.. తాజా ధరలివే..


ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాతోపాటు, ఏపీలో టెంపుల్ టూరిజంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వాటి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు తన వద్ద ఉన్నాయని త్వరలోనే దీనిపై సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్దామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై పూర్తి కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు.


Also Read: NASA SpaceX: ఐఎస్ఎస్ చేరిన స్పేస్‌ఎక్స్ క్రూ3.. మిషన్‌ను నడిపించిన తెలుగోడు.. ఆస్ట్రోనాట్ రాజాచారి ఎవరో తెలుసా!


Also Read: ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. కొద్ది రోజుల్లో నల్గొండలో అదే జరుగుతుందట!


Also Read: కుప్పంలో గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు .. భయపడకుండా ఓటేయాలని లోకేష్ పిలుపు !


Also Read : తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్


Also Read : హుజురాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. 13న టీ పీసీసీ నేతలతో ఢిల్లీలో సమీక్ష !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి