కుప్పం నియోజకవర్గ ప్రజలను భయపెట్టి, బెదిరించి ఓట్లు వేయించుకోవాలనుకోవడం సాధ్యం కాదని నారా లోకేష్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. జోరుగా వర్షం పడుతున్నప్పటికీ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో  లోకేష్ భారీ అభిమాన సందోహం మధ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి అడ్డా అని.. అందుకే అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధింపుతో కుప్పం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను మధ్యలో ఆపేశారని విమర్శించారు. 


Also Read : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?


జే ట్యాక్స్‌తో ఏపీలో  నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు.  జగన్ కటింగ్‌ల ముఖ్యమంత్రన్నారు. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వార్డులకు వస్తే ఏం చేశారో అడగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూ. 10 విడుదల చేసి 100రూపాయలు ప్రభుత్వం లాగేసుకుంటోందని.. ఎందుకు ఓటేయాలో వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించాలన్నారు. బెదిరింపులకు భయపడవద్ద.. ధైర్యంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇడుపులపాయ రాజకీయాన్ని కుప్పంకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని కుప్పంలో టిడిపిని గెలిపించాలన్నారు. కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది చంద్రబాబేనని.. కుప్పంలో గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు దిగారు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. 


Also Read : బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది.. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్లు జైలుకే


కుప్పంలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నియోజకవర్గాల నేతలు పెద్ద ఎత్తున మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల సాయంతో ఓటర్లను బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో  కుప్పంలో టీడీపీ కూడా కీలకమైన నేతల్ని మోహరించింది. వారిని పోలీసులు అక్కడ్నుంచి పంపేందుకు ప్రయత్నించారు. తమ అనుమతితోనే ప్రచారం చేయాలని డీఎస్పీ ఆర్డర్స్ ఇచ్చారు. వాటిపై టీడీపీ న్యాయపోరాటం చేస్తోంది.


Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?


ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే చంద్రబాబు కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఇప్పుడు లోకేష్ కూడా రావడంతో  కుప్పంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల నేతలు మోహరించడంతో కుప్పంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. 


Also Read : పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి